ఫైనల్ గా డ్రీమ్ ప్రాజెక్టును మొదలు పెట్టిన హీరో నిఖీల్!

యువ హీరో నిఖిల్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఆ మధ్య కొంచెం బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ తో కొంచెం సతమతమైన నిఖిల్ మొత్తానికి అర్జున్ సురవరం సినిమాతో ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ సక్సెస్ అందుకోవడానికి నిఖిల్ ఎంతగా కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా ఆగిపోయింది, అటకెక్కింది అనుకొని అందరూ మర్చిపోతున్న సమయంలో సినిమాను సడన్ గా రిలీజ్ చేశారు.

ఎదో ఒక విధంగా రిలీజ్ చేసిన నిఖిల్ మంచి సమయంలోనే సక్సెస్ అందుకున్నాడు. ఇకపోతే నెక్స్ట్ బాక్సాఫీస్ వద్ద మరొక బిగ్ హిట్ అందుకోవాలని నిఖిల్ కష్టపడుతున్నాడు. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ పేరుతో కార్తికేయ 2ను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది లాక్ డౌన్ కంటే కొంచెం ముందు మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ మొదలవ్వగానే ఆగిపోయింది. ఫైనల్ గా దాదాపు ఏడాది అనంతరం మళ్ళీ సినిమా పట్టాలెక్కింది.

Nikhil siddharth Karthikeya 2 shooting started

అయితే ఆ సినిమా కార్తికేయ కథకు సీక్వెల్ కాదని అసలు ఆ సినిమా కథకు కార్తికేయ2కి ఏ మాంత్రం సంబంధం ఉండదని దర్శకుడు ముందే క్లారిటీ ఇచ్చేశాడు. కార్తికేయ కు కలిగిన థ్రిల్ కంటే కూడా.. రెట్టింపు చేసేలా కార్తికేయ 2 ఉంటుందని చెప్పారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. భారతదేశంలోని వివిధ దేవాలయాల బ్యాక్ డ్రాప్ లొనే కథ నడుస్తుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X