నిఖిల్ వివాహంపై నెటిజన్ మీమ్.. నవ్వుకున్న హీరో
టాలీవుడ్‌లో బ్యాచ్‌లర్స్ లిస్ట్ తగ్గుతోంది. తాజాగా రానా తన ప్రేయసి మిహికా బజాజ్‌ను అందరికీ పరిచయం చేశాడు. ఈ ఏడాదిలోనే రానా పెళ్లి జరుగుతుందని సురేష్ బాబు ప్రకటించాడు. అంతా సవ్యంగా ఉండుంటే.. నిఖిల్-పల్లవి, నితిన్-షాలినీ జంట కూడా పెళ్లి పీఠలు ఎక్కేది. అయితే వీరిలో నిఖిల్ మాత్రం నేడు పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక లాక్ డౌన్ ముగిసేలా లేదని తొందరపడిన నిఖిల్ నేడు.. బంధుమిత్రుల సమక్షంలో పల్లవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు.
లాక్ డౌన్‌కు ముందు తన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరని అన్న నిఖిల్.. ఓ సారి వాయిదా వేశాడు. అయితే ఇక కరోనా వైరస్ ప్రభావం తగ్గదు, ప్రస్తుత పరిస్థితులు మారే అవకాశం లేకపోవడం, ముందు ముందు మంచి ముహుర్తాలు లేకపోవడంలో నేడు (మే 14)ఉదయం వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు శానిటైజర్, మాస్క్‌లు, భౌతిక దూరం ఇలాంటి రూల్స్‌ను పాటిస్తూ అతి కొద్దిమంది సమక్షంలోనే నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు.

ఈ మేరకు తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అందులో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అందులో మాస్కులు ఇటు వైపు, శానిటైజర్ అటు వైపు, ప్రేమ అన్ని వైపులా అని డైరెక్షన్స్ రాసి ఉంది. వీటిపై ఓ నెటిజన్ మీమ్ క్రియేట్ చేశారు. ఫుడ్ ఎక్కడో కొంచెం చెబితే.. అంటూ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలోని వెంకీ పిక్‌ను షేర్ చేశాడు. దీనిపై నిఖిల్ స్పందిస్తూ.. తెగ నవ్వుకున్నాడు.


Click it and Unblock the Notifications











