రామ్ చరణ్‌తో నిఖిల్ సినిమా.. విప్లవం మొదలు అంటూ ఊహించని స్కెచ్!
స్టార్ హీరోలు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సొంతగా ప్రొడక్షన్ హౌజ్ లు స్థాపిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే మరో నిర్మాతతో చేతులు కలిపి 'వి మెగా పిక్చర్స్' సంస్థను స్టార్ట్ చేశారు. అయితే ఈ బ్యానర్ లో మొదటగా వచ్చేది ఏ హీరో సినిమా అనే ఆసక్తి నెలకొంది. ఈ క్యూరియాసిటీకి ముగింపు పలుకుతూ అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు బిజీగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూనే మరొకవైపు డిఫరెంట్ స్టోరీలను ప్రొడ్యూస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ (Konidela Production Company)పై తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి, ఆచార్య సినిమాలను నిర్మించాడు ఈ మెగా పవర్ స్టార్. న్యూ టాలెంట్ ను మరింతగా ఎంకరేజ్ చేసే విధంగా ఇటీవల మరో నిర్మాతతో కలిసి 'వి మెగా పిక్చర్స్' (V Mega Pictures) ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించాడు.

ప్రభాస్ ఫ్రెండ్స్ స్థాపించిన యూవీ క్రియేషన్స్ సంస్థ భాగస్వామిలో ఒకరైన విక్రమ్ అనే ప్రొడ్యూసర్ తో మెగా పవర్ స్టార్ ఈ 'వి మెగా పిక్చర్స్' ప్రొడక్షన్ హౌజ్ స్థాపించారు. అయితే ఈ బ్యానర్ లో నటించే తొలి హీరో అక్కినేని అఖిల్ అని మొదటగా వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రొడక్షన్ హౌజ్ లో కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఫస్ట్ మూవీ రానుందని సమాచారం. అంతేకాకుండా కార్తికేయ 2, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ కూడా ఇందులో భాగస్వామి కానుంది.
వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ఇవాళ అనౌన్స్ చేశాయి. అయితే ఇందులో హీరో ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. దీనికి సంబంధించిన సినిమా వివరాలను రేపు అంటే మే 28న ఉదయం 11:11 గంటలకు వెల్లడించనున్నట్లు అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఓ వీడియో వదులుతూ Revolution Is Brewing అని క్యాప్షన్ ఇచ్చారు. విప్లవం పురుడు పోసుకుంటోంది అన్న మీనింగ్ లో ఈ క్యాప్షన్ ఉంది. ఇక ఈ వీడియోలో రెండు శక్తులు ఒక్కటై వస్తున్నాయి అంటూ ఆసక్తి పెంచారు.


Click it and Unblock the Notifications











