twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్ సురవరం ఫస్ట్ టాక్ రిపోర్ట్: నిఖిల్, లావణ్య కెమిస్ట్రీ.. ట్విస్టులు

    |

    నిఖిల్ సిద్ధార్థ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అర్జున్ సురవరం'. 'ఠాగూర్' మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. ఈ రోజు (నవంబర్ 29న) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శించబడ్డాయి. ఈ ప్రీమియర్స్ ద్వారా ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామా..

     జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌.. ట్విస్టులు

    జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌.. ట్విస్టులు

    మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రారంభమైన ఈ సినిమా 149 నిమిషాల నిడివితో కూడి.. ఆసక్తికర సన్నివేశాలతో తెరకెక్కిందని అంటున్నారు. జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో చాలా ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది.

     నిఖిల్, లావణ్య మధ్య కెమిస్ట్రీ

    నిఖిల్, లావణ్య మధ్య కెమిస్ట్రీ

    హీరో నిఖిల్ అర్జున్ లెనిన్ సురవరంగా ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిపోడ్ లోకి వెళ్లడం, ఆ వెంటనే వచ్చే సీన్స్ మెల్లగా కథలోకి తీసుకెళ్లాయని అంటున్నారు. ఓ స్టింగ్ ఆపరేషన్ వల్ల కలుసుకున్న నిఖిల్, లావణ్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుందని సమాచారం అందింది.

    వెన్నెల కిషోర్ ఎంట్రీ.. బీబీసీలో జర్నలిస్ట్‌

    వెన్నెల కిషోర్ ఎంట్రీ.. బీబీసీలో జర్నలిస్ట్‌

    లాయర్‌గా వెన్నెల కిషోర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడట. ఆ తర్వాత ఆయనపై కొన్ని ఫన్నీ సీన్స్ చిత్రీకరించి సీరియస్ మోడ్ నుంచి కామెడీ మోడ్ లోకి తీసుకొచ్చారట. అర్జున్ లెనిన్ బీబీసీలో జర్నలిస్ట్‌గా చేరి ఊహించని రీతిలో ఓ ఫోర్జరీ కేసులో అరెస్ట్ కావడం, ఆ తర్వాత పరిణామాలను సినిమాలో బాగా ఫోకస్ చేశారని అంటున్నారు.

    Recommended Video

    #CineBox : RGV Changed 'Kamma Rajyamlo Kadapa Redlu' Movie Title !
    ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే గ్యాంగ్‌పై దృష్టి

    ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే గ్యాంగ్‌పై దృష్టి

    ఆ తర్వాత నిఖిల్ బెయిల్ పై విడుదల కావడం, ఆ వెంటనే అతను, అతని స్నేహితులు కలిసి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే గ్యాంగ్‌పై దృష్టి పెట్టడం, ఇంటర్వెల్ ట్విస్ట్.. ఇక ఇంటర్వెల్ తర్వాత నిఖిల్‌పై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు సినిమాలో చెప్పుకోదగినవి అని టాక్ వచ్చింది.

    English summary
    Tollywood Young Hero Nikhil Siddharth new movie Arjun Suravaram. This movie released today and getting public talk as.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X