Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అర్జున్ సురవరం ఫస్ట్ టాక్ రిపోర్ట్: నిఖిల్, లావణ్య కెమిస్ట్రీ.. ట్విస్టులు
నిఖిల్ సిద్ధార్థ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అర్జున్ సురవరం'. 'ఠాగూర్' మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. ఈ రోజు (నవంబర్ 29న) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శించబడ్డాయి. ఈ ప్రీమియర్స్ ద్వారా ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామా..
జర్నలిజం బ్యాక్‌డ్రాప్.. ట్విస్టులు
మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రారంభమైన ఈ సినిమా 149 నిమిషాల నిడివితో కూడి.. ఆసక్తికర సన్నివేశాలతో తెరకెక్కిందని అంటున్నారు. జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో చాలా ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది.
నిఖిల్, లావణ్య మధ్య కెమిస్ట్రీ
హీరో నిఖిల్ అర్జున్ లెనిన్ సురవరంగా ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిపోడ్ లోకి వెళ్లడం, ఆ వెంటనే వచ్చే సీన్స్ మెల్లగా కథలోకి తీసుకెళ్లాయని అంటున్నారు. ఓ స్టింగ్ ఆపరేషన్ వల్ల కలుసుకున్న నిఖిల్, లావణ్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుందని సమాచారం అందింది.
వెన్నెల కిషోర్ ఎంట్రీ.. బీబీసీలో జర్నలిస్ట్
లాయర్‌గా వెన్నెల కిషోర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడట. ఆ తర్వాత ఆయనపై కొన్ని ఫన్నీ సీన్స్ చిత్రీకరించి సీరియస్ మోడ్ నుంచి కామెడీ మోడ్ లోకి తీసుకొచ్చారట. అర్జున్ లెనిన్ బీబీసీలో జర్నలిస్ట్‌గా చేరి ఊహించని రీతిలో ఓ ఫోర్జరీ కేసులో అరెస్ట్ కావడం, ఆ తర్వాత పరిణామాలను సినిమాలో బాగా ఫోకస్ చేశారని అంటున్నారు.
Recommended Video
ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే గ్యాంగ్‌పై దృష్టి
ఆ తర్వాత నిఖిల్ బెయిల్ పై విడుదల కావడం, ఆ వెంటనే అతను, అతని స్నేహితులు కలిసి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే గ్యాంగ్‌పై దృష్టి పెట్టడం, ఇంటర్వెల్ ట్విస్ట్.. ఇక ఇంటర్వెల్ తర్వాత నిఖిల్‌పై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు సినిమాలో చెప్పుకోదగినవి అని టాక్ వచ్చింది.