Spy Twitter Review: స్పై మూవీకి ఊహించని టాక్.. నిఖిల్ యాక్టింగ్ అలా.. గాంధీజీని లాగుతూ రివ్యూ
విభిన్నమైన స్టోరీస్‌ను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇటీవల కార్తికేయ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల కోసం నార్త్ ఆడియెన్స్ సైతం ఎదురుచూసేంతలా క్రేజ్ సంపాదించాడు. దీంతో నిఖిల్ సినిమాలపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు స్పై చిత్రంతో రానున్నాడు. జూన్ 29 అంటే ఇవాళ స్పై విడుదలకు రెడీగా ఉండగా కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. వాటిని చూసిన నెటిజన్ల టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.
డెత్ సీక్రెట్:టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం స్పై. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న రహస్యం, ఆయన జీవితానికి సంబంధించిన పలు సన్నివేశాలతో ఆసక్తికర థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో స్పై సినిమా రూపొందినటనట్లు తెలుస్తోంది. ఇక స్పై టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రాగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి. హెచ్ దర్శకుడిగా మారారు.

రానా దగ్గుబాటి:నిఖిల్ స్పై సినిమాకు కె. రాజశేఖర్ రెడ్డి కథ అందించడంతోపాటు ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై స్వయంగా నిర్మించారు. ఇందులో అభినవ్ గోమఠం, ఐశ్వర్య మీనన్, ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్ కీలక పాత్రలు పోషించగా.. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమాను జూన్ 29న అంటే గురువారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కానుంది.
ప్రశంసనీయ చిత్రం:నిఖిల్ స్పై మూవీకి ఇప్పటికే పలు ప్రీమియర్ షోలు పడ్డాయి. తమ అభిప్రాయాలను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. "స్పై మూవీ ప్రశంసనీయ చిత్రం. కథ, సమయం, చరిత్ర, కళాకారుల నటన సమగ్రంగా అద్భుతం" అని ఒక నెటిజన్ ట్విటర్ వేదికగా తెలిపాడు.
రెగ్యులర్ డ్రామా:"ఇప్పటివరకు అయితే స్పై చూడాలని చెప్పే సినిమాలా అనిపించలేదు. ఇతర సినిమాల్లాగే రెగ్యులర్ స్పై, కాప్ డ్రామాలాగే ఉంది. సినిమాను కాపాడాలంటే సెకండాఫ్ భారీగా ఉండాలి. ఇప్పటి వరకు అయితే రేసీ స్క్రీన్ ప్లే, సాంగ్స్ లేకపోవడం సినిమాకు ప్రధాన హైలెట్" అంశాలు అని ఒకరు స్పై మూవీ ఫస్టాఫ్ గురించి రివ్యూ ఇచ్చారు.
బాగా చూపించలేదు:"స్పై సినిమా ఫస్టాఫ్ అంతా ఓ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ను కనిపెట్టే మిషన్ తో సాగుతుంది. ఇలాంటి జోనర్ లో మనం ఊహించేటువంటి సీట్ ఎడ్డ్ సన్నివేశాలు ఏం లేవు. ఇక ఈ సినిమా రిజల్ట్ అంతా సెకండాఫ్ పైనే ఆధారపడి ఉంది", "దాదాపు అన్ని ఊహించే సీన్లతో సెకండాఫ్ చివరికి వచ్చింది. ఎత్తుగడలు వేసే సన్నివేశాలు తక్కువ. అక్కడక్కడ బాగుంది. నేతాజీ కథను బాగా నేరేట్ చేయలేదు. దర్శకుడు సాదాసీదాగా తెరకెక్కించారు" అని తెలుగు బులిటెన్ ట్విటర్ లో రివ్యూ ఇచ్చింది.
నేతాజీతోనే స్వాతంత్ర్యం:"స్పై సినిమా వేరే లెవెల్. నిఖిల్ యాక్టింగ్ ఇరగదీశాడు. మిషన్ ఇంపాజిబుల్, జేమ్స్ బాండ్ సినిమాల్లా ఉంది", "నిఖిల్ యాక్టింగ్ అద్భుతం. అతని కెరీర్ ప్లస్ పర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. నిఖిల్ కు ఇది బ్రేక్ మూవీ అవుతుంది", "స్పై మూవీ ఒక రేంజ్ లో ఉంది. ఇన్నిరోజులు గాంధీజీ వల్ల స్వాతంత్య్రం వచ్చిందనుకున్నా. కానీ సినిమా చూశాకే అర్థమైంది నేతాజీతో వచ్చిందని. చాలా క్లియర్ గా చూపించారు. నేతాజీ డెత్ విషయం ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. కార్తికేయ కన్నా చాలా బాగుందనిపించింది" అని పబ్లిక్ తెలిపారు.
పక్కా హిట్:"స్పై మూవీ నిజంగా చాలా బాగుంది. జెన్యూన్ రివ్యూ. వాళ్లు వీళ్లు చెబుతున్నారని కాదు. ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమా. మెయిన్లీ మెసేజ్ ఒరియెంటెడ్", "సినిమా చాలా బాగుంది. నిఖిల్ యాక్టింగ్ బాగుంది. పల్లెటూరి విధానం బాగుంది. రాజకీయం బాగుంది. దాంతో ఎలా మోసపోతారో చూపించారు", "చాలా సూపర్బ్ గా ఉంది. పాన్ ఇండియా హిట్ అవుతుందని అనుకుంటున్నా" అని లేడీ ఆడియెన్స్ రివ్యూ ఇచ్చారు. ఇలా స్పై మూవీకి ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. ట్విటర్ రివ్యూలలో మిశ్రమ స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











