ఇండస్ట్రీలో ఆవిడ పిలిస్తే ఎవ్వరైనా వెళ్లాల్సిందే.. నైట్ డ్రెస్ వేసుకొని ఓ గంట రమ్మంది
ఇండస్ట్రీలో మోహన్ బాబు అన్న, మంచు లక్ష్మీ అన్న అందరికీ హడలే. యువ హీరోలకు, హీరోయిన్లకు మంచు లక్ష్మీ చెప్పిందే శాసనం. అందరితోనూ కలసి మెలిసి ఉండే ఈమె అన్నా.. అందరికీ ఇష్టమే. ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అని తేడా లేకుండా అందరితోనూ మంచి సంబంధాలను మెయింటెన్ చేస్తూ ఉంటుంది.

బుల్లితెరపై షోలతో సందడి..
ప్రేమతో మీ లక్ష్మీ లాంటి షోతో ఎంతో మంది సెలబ్రిటీల మనోగతాలను ప్రేక్షకులకు చూపించింది. మేముసైతం లాంటి కార్యక్రమాలను చేసి ఎంతో మందికి సహాయపడింది. మిగతా సెలబ్రిటీలతోనూ సహాయం చేయించింది. ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటున్న మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.

తాజాగా మసాలా షోతో ప్రేక్షకుల ముందుకు...
మారిన కాలమాన ప్రకారం.. మంచు లక్ష్మీ కూడా తన పంతాను మార్చుకుంది. మునుపటిలా కాకుండా కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది. సెలబ్రెటీల బెడ్రూమ్ ముచ్చట్లను అభిమానుల ముందుకు తీసుకువస్తుంది. మసాల మ్యాటర్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇంతకు ముందు సమంత, రకుల్, శ్రుతీ హాసన్
ఈ షోలో ఇప్పటి వరకు సమంత, రకుల్, శ్రుతీ హాసన్, వరుణ్ తేజ్ లాంటి సెలబ్రెటీలు పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఎవరికీ తెలియని ఎన్నో సంగతులను మంచు లక్ష్మీతో కలిసి బయటపెట్టారు. ఈ క్రమంలో సమంత, రకుల్, శ్రుతీ చేసిన వ్యాఖ్యలు ఎంతగానో వైరల్ అయ్యాయి.

తాజాగా నిఖిల్ కూడా..
తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుంటూ.. సినిమాల్లో వైవిధ్యం చూపిస్తూ సక్సెస్ రుచి చూస్తున్న నిఖిల్ ఈ షోలో పాల్గొని ఎన్నో సీక్రెట్స్‌ను బయటపెట్టాడు. ఈ క్రమంలో మంచు లక్ష్మీ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆవిడ పిలిస్తే వెళ్లాల్సిందే..
షోలో పాల్గొన్న నిఖిల్.. మంచు లక్ష్మీ గురించి చెబుతూ.. ఆమె పిలిస్తే మా యంగ్ హీరోల్లో ఎవరైనా వెళ్లాల్సిందే.. లేదా కైమా కొట్టేస్తుందని ఫన్నీగా కామెంట్ చేశాడు. అనంతరం.. మంచు లక్ష్మీ మాట్లాడుతూ నిఖిల్‌ను అలాగే నైట్ డ్రెస్ వేసుకుని షో కోసం ఓ గంట రమ్మన్నాను అని చెప్పుకొచ్చింది. ఈ షోలో పాల్గొన్న నిఖిల్.. తన ప్రేమ విషయాన్ని బయటపెట్టేశాడు.


Click it and Unblock the Notifications











