ప్రియురాలితో హీరో నిఖిల్ వివాహం.. మూడు మూళ్ల బంధంతో ఒక్కడైన జంట

లాక్‌డౌన్‌, ఇతర ఊగిసలాటల మధ్య యువ హీరో నిఖిల్ వివాహం జరిగిపోయింది. గత కొద్దికాలంగా డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి ఒప్పించారు. జాతకాల ప్రకారం.. తిథి, నక్షత్రాల బట్టి పెళ్లికి ప్రస్తుతం అనువుగా ఉండటంతో అతికొద్ది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య గురువారం ఉదయం పల్లవి వర్మ మెడలో మే 17 తేదీ ఉదయం 6:31 గంటలకు తాళి కట్టారు. పెళ్లికి సంబంధించిన వివారాల్లోకి వెళితే..'

Recommended Video

Exclusive Pics Of Actor Nikhil Siddharth And Pallavi Marriage
 షామీర్ పేట రిసార్టులో

షామీర్ పేట రిసార్టులో

హీరో నిఖిల్ వివాహానికి కరోనావైరస్ లాక్ డౌన్ అడ్డంకిగా మారింది. ఏప్రిల్‌లో జరుగాల్సిన పెళ్లి మే 14 వాయిదా పడింది. అయితే లాక్‌డౌన్ పరిస్థితులు మారే అవకాశాలు కనిపించకపోవడంతో తన పెళ్లిని నిరాడంబరంగా చేసుకోవాలని నిఖిల్ నిర్ణయించుకొన్నారు. ఆ మేరకు హైదరాబాద్‌కు సమీపంలోని షామీర్ పేటలోని రిసార్టు పెళ్లి వేడుకకు వేదికైంది.

 వేద పండితుల మంత్రాల మధ్య

వేద పండితుల మంత్రాల మధ్య

గురువారం తెల్లవారు జామున ఉదయం 6.31 గంటలకు వేదపండితులు "శతమానం భవతి శతాయుః, పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతున.. కంటే భద్రామి శుభతే త్వం జీవ శరదంశతం" అంటూ దీవించగా మంగళ వాయిద్యాలు మధ్య డాక్టర్ పల్లవి మెడలో నిఖిల్ తాలి కట్టారు.

 అతిథులు మాస్కులతో

అతిథులు మాస్కులతో

నిఖిల్, డాక్టర్ పల్లవి పెళ్లికి అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ అతిథులంతా ముఖాలకు మాస్కులు ధరించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నిఖిల్ దంపతులకు కుటుంబ సభ్యులు అంక్షితలు వేసి ఆశీర్వదించారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడిన తర్వాత సినీ ప్రముఖులకు విందును ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యువ హీరో ఉన్నారు.

లాక్‌డౌన్ ఆంక్షల వల్ల

లాక్‌డౌన్ ఆంక్షల వల్ల

ఇక నిఖిల్ వివాహానికి సినీ ప్రముఖులు, అభిమానులంతా దూరంగా ఉన్నారు. కరోనా పరిస్థితులు నగరంలో బాగా లేకపోవడం వల్ల ఆంక్షల మేరకు వారు హాజరుకాలేదని తెలుస్తున్నది. వివాహం సందర్భంగా నిఖిల్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు, సందేశాలు పంపినట్టు తెలిసింది. పలువురు సోషల్ మీడయా ద్వారా విషెస్ తెలియజేశారు.

తిలకం దిద్దుతున్న వధువు డాక్టర్ పల్లవి వర్మ

తిలకం దిద్దుతున్న వధువు డాక్టర్ పల్లవి వర్మ

పెళ్లి కొడుకు నిఖిల్ నుదట తిలకం దిద్దుతున్న వధువు డాక్టర్ పల్లవి వర్మ

పెళ్లి పూజలో నిమగ్నమైన నిఖిల్

పెళ్లి పూజలో నిమగ్నమైన నిఖిల్

సంప్రదాయ పద్దతుల్లో పెళ్లి పూజలో నిమగ్నమైన హీరో నిఖిల్, పల్లవి వర్మ

నిఖిల్, పల్లవి పెళ్లి

నిఖిల్, పల్లవి పెళ్లి

నిఖిల్, పల్లవి పెళ్లి వేదిక వద్ద #nikpal హ్యాష్ ట్యాగ్

నిఖిల్ పెళ్లి సందర్భంగా

నిఖిల్ పెళ్లి సందర్భంగా

నిఖిల్ పెళ్లి సందర్భంగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణం

అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న హీరో నిఖిల్

అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న హీరో నిఖిల్

పెళ్లి అనంతరం నూతన వధువుకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న హీరో నిఖిల్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X