twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పట్టపగలే దోపిడి.. దారుణమైన స్థితిలో కరోనా పేషెంట్.. కేటీఆర్‌కు దండంపెట్టిన నిఖిల్

    |

    ప్రస్తుతం కరోనా వైరస్ ఏ రేంజ్‌లో ప్రభావం చూపిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పల్లెల్లోనూ తాండవం చేసింది. అంతకుముందు కేవలం సిటీల్లోనే ఈ వైరస్ విజృంభించగా ప్రస్తుతం అక్కడా ఇక్కడా వారికి వీరికి అని తేడా లేకుండా వ్యాప్తి చెందుతోంది. మన దేశం సైతం కరోనా కేసుల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

    ప్రపంచంలో నెంబర్ వన్ దిశగా..

    ప్రపంచంలో నెంబర్ వన్ దిశగా..

    కరోనా కేసుల్లో ఇండియా కొత్త రికార్డలను నమోదు చేస్తోంది. ఒక్కరోజులోనే వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దాదాపు 42 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చేజారిపోయింది. రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇలా కేసులు పెరిగిపోతూ ఉంటే.. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల దోపీడీలు ఎక్కువయ్యాయి.

    ప్రైవేట్‌కు వెళ్తే అంతే..

    ప్రైవేట్‌కు వెళ్తే అంతే..

    కరోనా వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే ఇక అంతే సంగతులు. మధ్య తరగతి, పేదవారు గనుకు అలాంటి సాహసం చేస్తే బిల్లు చూసి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అంతలా ప్రేవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. తాజాగా వీటిని నిదర్శనంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.

    బిల్లు రూ. 15 లక్షలు..

    బిల్లు రూ. 15 లక్షలు..

    నల్గొండలోని సుప్రజ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు సదరు పేషెంట్‌కు కరోనా వచ్చిందని చికిత్స తీసుకున్నారట. అయితే బిల్లు రూ. 15 లక్షలు అయిందంటా. అయితే ఆరు లక్షలుకట్టారట.. మిగతావి కడితే గానీ డిశ్చార్జ్ చేయమని బెదిరిస్తున్నారట. ఏం అర్థం కావడం లేదు సర్ అంటూ కేటీఆర్‌కు తమ గోడును వెల్లిబుచుకున్నారు. సొంతిళ్లు లేదు, భూమి కూడా లేదు.. అమ్మని కాపాడండి సర్ అంటూ ఓ బిడ్డ కేటీఆర్‌ను వేడుకుంది.

    Recommended Video

    Actor Nikhil Siddhartha Dr Pallavi Varma Exclusive Marriage Video
    దండం పెట్టిన నిఖిల్..

    దండం పెట్టిన నిఖిల్..

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిఖిల్ఈ ఘటనపై స్పందించాడు. పట్టపగలే ఇది నిలువుదోపిడి.. హైద్రాబాద్ కమిషనర్, సిటీ కమిషనర్, కేటీఆర్ సర్ దయచేసి న్యాయం చేయండి అంటూ చేతులెత్తి దండం పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Nikhil Siddhartha Request To KTR Hospital Bill On Corona Patient. This is Daylight Robbery... Requesting cpcybd CPHydCity To please look into this injustice sir.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X