నిఖిల్, స్వాతి జంటగా ‘కార్తికేయ’ ప్రారంభం
కార్తికేయ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ...పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. మరో పది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతాం. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ చేస్తాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.
ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.


Click it and Unblock the Notifications












