నిఖిల్-స్వాతి జంటగా 'మాగ్నస్ సినీ ప్రైమ్ ' చిత్రం
హైదరాబాద్ : 'స్వామి రారా' లాంటి హిట్ చిత్రంలో నటించిన నిఖిల్, స్వాతి మరోసారి జంటగా నటించబోతున్నారు. 'మాగ్నస్ సినీ ప్రైమ్' సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్‌తో కూడిన వినోదాత్మక చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. జూన్ నెల తొలి వారంలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని. నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ; కధ- మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.
ఈ మధ్య హిట్ పెయిర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'స్వామి రారా' చిత్రంతో హిట్ కొట్టిన నిఖిల్, స్వాతిలతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసారు. ఇటీవల ఇష్క్ చిత్రంతో హిట్ కొట్టిన నితిన్-నిత్యా మీనన్ ఆ వెంటనే నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











