నిఖిల్ కోసం కోన వెంకట్ స్టోరీ
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ రైటర్ గా కెరీర్ సాగిస్తున్న రచయితల్లో కోన వెంకట్ ఒకరు. ఆయన ఏ సినిమాకు పని చేసినా.....ఆ సినిమా బాగా ఆడుతుందనే పేరు ఉంది. ఆయన రాసే డైలాగ్స్, స్క్రీన్ ప్లే కోసం పలువురు దర్శకులు, హీరోలు ఎదురు చస్తారంటే ఆయనకున్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కోన వెంకట్ యంగ్ హీరో నిఖిల్ కోసం కథను తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ ఈ చిత్రం ఉండబోతోంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. 2015లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

'కార్తికేయ' సినిమా విజయంతో మంచి డిమాండులోకి వచ్చిన నిఖిల్ ప్రస్తుతం 'సూర్య వెర్సస్ సూర్య' అనే సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ‘సూర్య వర్సెస్ సూర్య' మూవీ సాగుతుందని చిత్ర యూనిట్ చెప్తుంది. గతంలో పలు చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పరిచయం కానున్నారు.
సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ‘సూర్య వర్సెస్ సూర్య' మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. స్వామిరారా, కార్తీకేయ తరహాలోనే నిఖిల్ డిఫరెంట్ గా ఉంటాడని నిర్మాత చెప్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నిర్మాత శివకుమార్ చెప్పారు. ప్రతి సీన్ కూడా మూవీకి హైలెట్ అవుతుందన్నారు నిర్మాత.


Click it and Unblock the Notifications











