twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిట్ నెస్ ట్రైనర్ గా నిఖిల్ ట్వీట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: 'స్వామిరారా' విజయంతో దూసుకుపోతున్న నిఖిల్ తాజాగా ఫిటెనెస్ ట్రైనర్ గా, డైటీషియన్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ట్విట్టర్ లో తన అకౌంట్ లో ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలను అడగమని తన ఫ్యాన్స్ ని కోరాడు. అలాగే తనకు ఫిట్ నెస్ పై చాలా అవగాహన వుందని, అతని అభిమానులకి ట్విట్టర్ ద్వారా కొన్ని సలహాలను ఇచ్చాడు. రీబాక్ సంస్థ ద్వారా ఫిట్ నెస్ ట్రైనర్ గా 2006 లో సర్టిఫికేట్ ఇచ్చిందని తెలిపాడు.

    ఇక నిఖిల్‌, స్వాతి హీరోహీరోయిన్లుగా మాగ్నస్‌ సినిప్రైమ్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో ' కార్తికేయ' చిత్రం ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. 'స్వామిరారా' చిత్రం విజయం తర్వాత నిఖిల్‌, స్వాతి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు 'కార్తికేయ'. చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాత.

    హీరో నిఖిల్‌ మాట్లాడుతూ 'స్వామిరారా చిత్రం తర్వాత చాలా సినిమాలే వచ్చాయి. కానీ వాటన్నింటిలో నాకు బాగా స్క్రిప్ట్‌...కథ నచ్చి చేస్తున్న చిత్రం ఇదే' అన్నారు. నిర్మాత వెంకట శ్రీనివాస్‌ మాట్లాడుతూ 'కొత్త ప్రయత్నంగా ఈ చిత్రం చేస్తున్నాము. ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయం 'స్వామి రారా'. ఆ సినిమాలో నిఖిల్, స్వాతి జంట యువతరాన్ని విశేషంగా అలరించిందనే చెప్పాలి. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం 'కార్తీకేయ'. నిఖిల్‌, స్వాతి సహకారంతోనే ఈ చిత్రం మొదలుపెట్టాను. చిత్ర సమర్పకుడు రాజేష్‌వర్మ నాకు అండగా నిలబడ్డారు' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ -''ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు. ఒకవేళ సమాధానం దొరక్కపోతే... ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే ఓ యువకుని జీవితంలో ఎదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్ర కథ. ఇందులో నిఖిల్, స్వాతి వైద్య విద్యార్థులుగా నటిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశమిది. గుడి నేపథ్యంగా ఈ చిత్రం ఉండబోతోంది'' అని చెప్పారు.

    ''నిఖిల్ చిత్రాల్లో ఇది హైబడ్జెట్ మూవీ. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని నిర్మాతలు తెలిపారు. తనికెళ్ల భరణి, నాజర్, రావురమేష్, ప్రవీణ్, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్‌చంద్ర, కూర్పు: కార్తీక శ్రీనివాస్, పాటలు: కృష్ణచైతన్య, కార్యనిర్వాహక నిర్మాత: గునకల మల్లికార్జున్, సమర్పణ: శిరువూరి రాజేష్‌వర్మ, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: చందు మొండేటి.

    English summary
    Nikhil has surprised his fans by turning in to fitness and dietician expert and has openly asked his twitter followers to shoot questions so that he will help them to stay in good health.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X