నిఖిల్ 'వీడు తేడా' సెన్సార్ కట్స్
రెండు వారాల క్రితం నిఖిల్ హీరోగా విడుదల అయిన చిత్రం 'వీడు తేడా'.అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' 'వీడు తేడా' చిత్రాన్ని చూసి 8 కట్స్‌లో తల్లిదండ్రుల నిర్దేశకత్వంలో పిల్లలు చూడాలంటూ 15-11-2011న 'యుఎ' సర్టిఫికెట్ జారీ చేసింది.
1. మద్యపానం, ధూమపానంకి సంబంధించిన దృశ్యాలు సినిమాలో ఎక్కడ వున్నా అక్కడ చట్ట బద్ధమైన హెచ్చరిక చూపమన్నారు.
2. లిక్కర్ బ్రాండ్ పేరు గల కార్టన్స్ వున్న దృశ్యాలు తొలగించారు.
3. ఒకటి, రెండు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశాల్లోని 'నా కొడకా', 'పప్పలు' పదాలు తొలగించారు.
4. 'శ్రీదేవి, బోనీకపూర్' పేర్లను తొలగించమన్నారు.
5. 'బొంగు', 'నీ యబ్బా', 'డ్రాయర్', 'డ్రాయరా మట్టరా' అని చిత్రీకరించిన పదాలు కత్తెర పాలయ్యాయి.
6. అయిదు ఆరు రీళ్ళలో ఎ) 'దొంగముండ' బి) 'నా కొడకా' సి) 'కుకుంబం పగిలి పోదు' పదాలను తొలగించమన్నారు.
7. పదకొండు పన్నెండు రీళ్ళలో ఎ) బన్నాస్వామి భక్తురాలుకి సంబంధించి ఎక్స్‌పోజ్ చేసిన క్లీవేజ్ దృశ్యాలను తొలగించారు.
బి) ''మా బతుకులు 'సిడి' రూపంలో బయట పెడతారు'' వాక్యం కత్తెర పాలయింది.
3744.18 మీటర్ల నిడివిగల 'వీడు తేడా' చిత్రం 19-11-2011న విడుదలయింది.
నిఖిల్, పూజాబోస్, సాయాజీ షిండే, ప్రదీప్‌రావత్, సుమన్, కృష్ణభగవాన్, అలీ, ఎంఎస్. నారాయణ, రఘుబాబు, హేమ, మాస్టర్ భరత్ నటించిన చిత్రం 'వీడు తేడా'. లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్‌మెంట్ పతాకాన బి. చిన్నికృష్ణ దర్శకత్వంలో కళ్యాణ చక్రవర్తి నిర్మించారు. సంగీతం చక్రి, ఛాయా గ్రహణం భట్, కూర్పు గౌతంరాజ నిర్వహించారు.


Click it and Unblock the Notifications











