కామిడీ కథ (వీడు తేడా ప్రివ్యూ)

By Srikanya

హ్యాపీడేస్ తో పరిచయమైన నిఖిల్ తాజా చిత్రం వీడు తేడా ఈ రోజు విడుదల అవుతోంది. ఈ చిత్రంతో బి.చిన్ని కృష్ణ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. చిత్రం కథలో కత్తి శ్రీను పాత్రను నిఖిల్ పోషించాడు. కథ ప్రకారం.. కత్తిశీను (నిఖిల్‌) పనీపాటా లేకుండా తిరుగుతుంటాడు. ప్రేమిస్తున్నానంటూ ఓ అమ్మాయి వెంట పడతాడు. నీలాంటి తిరుగుబోతుకు పిల్లనెలా ఇవ్వాలంటూ ఆ యువతి తండ్రి చివాట్లు పెడతాడు. నీ కూతురు కంటే అందమైన అమ్మాయిని ప్రేమించి చూపిస్తానని సవాల్‌ చేస్తాడు శీను. ఆ వేటలో ఉన్న శ్రీనుకి ఓ పెళ్లిలో మేఘన (పూజాబోస్‌) కనిపిస్తుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే అప్పుడే అనుకోని ట్విస్ట్ పడుతుంది. ఇంతకీ శ్రీను అంతలా ప్రేమలో పడిపోయిన ఆమె నేపథ్యం ఏమిటి? మేఘన ప్రేమ శీనుకి దక్కిందా లేదా అన్నది తెర మీదే చూడాలి. ఈ సినిమాపై దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నిఖిల్‌ నటన కడుపుబ్బ నవ్విస్తుంది. చక్రి అందించిన స్వరాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

సంస్థ: లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: నిఖిల్‌, పూజాబోస్‌, బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, అలీ, ఎమ్మెస్‌నారాయణ, రఘుబాబు, మాస్టర్‌ భరత్‌ తదితరులు.
నిర్మాత: కల్యాణ చక్రవర్తి
సంగీతం: చక్రి
దర్శకత్వం: బి.చిన్నికృష్ణ
విడుదల: శుక్రవారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X