నిజం...కలర్స్ స్వాతి తో ఎఫైర్ లేదు...ఏమీ లేదు

By Srikanya

హైదరాబాద్: ‘‘ గాసిప్స్‌ను ఆపలేం. నేనేమిటో నాకు తెలుసు. స్వాతి, నేను కలిసి రెండో సినిమా చేస్తున్నామనగానే గాసిప్స్‌ మొదలైపోయాయి. అయితే మేమిద్దరం కలుసుకునేది సెట్స్‌మీదనే. షూటింగ్‌ అయిపోగానే స్వాతి నిమిషం కూడా సెట్స్‌ మీద ఉండేది కాదు. వెంటనే ఇంటికి వెళ్లిపోయేది. ఇంకో విషయం చెప్పనా. మేం స్నేహితులం కూడా కాదు. కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం. అంతే.'' అని చెప్పారు నిఖిల్‌.

మాగ్నస్‌ సినీ ప్రైమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మించిన ‘కార్తికేయ' చిత్రంలో ఆయన హీరోగా నటించారు. చందు మొండేటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంగి, ఈ సందర్భంగా మీడియాతో నిఖిల్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

అలాగే....‘‘నేను సోలో హీరోగా నటించిన ‘యువత' హిట్టయ్యాక, ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో వెంటవెంటనే నాలుగు సినిమాలు ఒప్పుకున్నాను. అయితే ఇప్పుడు ‘స్వామి రారా' హిట్‌ తర్వాత అలా ఒప్పుకోకుండా బాధ్యతగా వ్యవహరిస్తూ కథల విషయంలో సెలక్టివ్‌గా ఉంటూ, ‘కార్తికేయ' సబ్జెక్ట్‌ బాగానచ్చి చేశాను'' అని చెప్పారు నిఖిల్‌.

నిఖిల్ ఇంకేమన్నాడు అనేది స్లైడ్ షో లో ...

నాకు పిచ్చ ఇష్టం...

నాకు పిచ్చ ఇష్టం...


నాకు ‘ఆదిత్య 369', ‘భైరవద్వీపం' వంటి ఫాంటసీ సినిమాలంటే పిచ్చ ఇష్టం. ‘కార్తికేయ' కథలోని ఫాంటసీకి నేను ఎట్రాక్ట్‌ అయ్యాను. ట

కాకతాళీయమే...

కాకతాళీయమే...

విఘ్నేశ్వర విగ్రహం నేపథ్యంలో ‘స్వామి రారా' కథ నడిస్తే, కార్తికేయుని (సుబ్రహ్మణ్యస్వామి) గుడి నేపథ్యంలో ‘కార్తికేయ' కథ నడవడం కేవలం కాకతాళీయం. అలాగే ఆగస్ట్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కార్తీక మాసం ఆరంభంలో విడుదల కావడమూ అటువంటిదే.

ఇగో మేజికల్ జర్నీ...

ఇగో మేజికల్ జర్నీ...

ఒకట్రెండు సినిమాలు చేద్దామనుకున్న వాణ్ణి పది సినిమాలు చేశాను. ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నా ఇక్కడిదాకా వచ్చాను. దీన్ని ఓ మేజికల్‌ జర్నీగా భావిస్తున్నాన్నా..

నా క్యారెక్టర్...

నా క్యారెక్టర్...

ఇందులో నా పాత్ర పేరు కార్తీక్‌. ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌గా నటించా. ఏదైనా సందేహం వస్తే, దానికి సమాధానం అన్వేషించడానికి ఏంతదూరమైనా వెళ్లే పాత్ర నాది. ఫలానా బూత్‌ బంగ్లాలో దెయ్యం ఉందట కదా! అని ఎవరైనా అంటే అది నలుగురి ద్వారా వేగంగా దూసుకుపోతుంది. ఆ తర్వాత అటువైపు చూడాలంటే భయపడతారు. కానీ పదిమందిలో ఒక్కడు మాత్రం అక్కడ ఏముందో చూడాలనుకుంటాడు. అలాంటి పాత్రలో నేను నటించాను.

లర్స్ స్వాతిది...

లర్స్ స్వాతిది...

కస్వాతి చేసిన పాత్ర పేరు వల్లి. తను మా కాలేజీలో బీడీఎస్‌ స్టూడెంట్‌గా నటించింది. ‘స్వామి రారా'తో మా ఇద్దరిదీ హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకోవడంతో దర్శకుడు చందు హీరోయిన్‌ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని భావించాడు. తను తెలుగమ్మాయి కావడం వల్ల సన్నివేశాలు బాగా పండాయి.

అలాగే వల్లి (స్వాతి) నా లక్కీ ఛార్మ్‌గా కనిపిస్తుంది ఈ సినిమాలో. వల్లి కనిపిస్తే నాకు ఏదో రకంగా కలిసొస్తుంటుంది. ఒకసారి మ్యాన్‌హోల్‌లో పడబోయి తప్పించుకోగలుగుతా.

తమిళంలోనూ పరిచయం అవుతా...

తమిళంలోనూ పరిచయం అవుతా...

దీన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తీశాం. తమిళ వెర్షన్‌ నవంబర్‌లో విడుదలవుతుంది. ఇప్పటికే స్వాతి తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. నేను కూడా తమిళులకు పరిచయం కావాలని ఆశిస్తున్నా.

కథ నేపధ్యం...

కథ నేపధ్యం...

ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లోని సుబ్రహ్మణ్యపురం అనే ఊళ్లోని కార్తికేయుని గుడి చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ గ్రామం కథపరంగా కల్పించిందే. చందు థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించాడు. దానికి వినోదాన్ని జోడించాడు. ‘స్వామి రారా' క్రైమ్‌ కామెడీ అయితే ఇది థ్రిల్లర్‌ కామెడీ అన్నమాట.

అదిరిందంటున్నారు..

అదిరిందంటున్నారు..

ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘గుండ్రంగా తిరిగే భూమికి వాస్తు ఏంటి?' అంటూ నేను చెప్పే డైలాగ్‌ అదిరిందంటున్నారు.దైవాన్ని నమ్మాలా? సైన్స్‌ను నమ్మాలా? అన్నదే కాన్సెప్ట్‌. నేనయితే అన్నిటినీ నమ్ముతా. దేవుడిని నమ్మి తీరుతా. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఓ గుడిని మూసేశారని ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే సుబ్రహ్మణ్యస్వామి గుడి అనేది ఫాంటసీలోనే క్రియేట్‌ చేశాం. కథ పరంగా పాయింట్‌ చెప్పకూడనిది.

గ్రాఫిక్స్

గ్రాఫిక్స్


ఇందులో 25 నిమిషాల నిడివి కలిగిన గ్రాఫిక్స్‌ ఉన్నాయి. అందువల్ల సినిమా విడుదలలో కాస్త జాప్యం జరిగింది.

షెర్లాక్ హోమ్స్ హీరోలా...

షెర్లాక్ హోమ్స్ హీరోలా...

‘స్వామి రారా' చేసేప్పుడు నా బరువు 72 కిలోలు. ఈ సినిమాకు వచ్చేసరికి 82 కిలోలున్నా. పది కిలోల బరువు పెరిగాను. కావాలనే బాడీని పెంచాను. నా దర్శకుడు షెర్లాక్‌హోమ్స్‌ హీరోలా కనిపించాలన్నారు. అందుకు తగ్గట్టే మారిపోయా.

అంచనాలు ఉండవని తెలుసు

అంచనాలు ఉండవని తెలుసు

నా సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలేమీ ఉండవు. భారీ ఓపెనింగ్స్‌ ఉండవు. సినిమాని నీట్‌గా తీస్తే, బాగుందని టాక్‌ వస్తే జనం వస్తారు. నా వరకు నేను క్లీన్‌ ఫిలిమ్స్‌ చేసుకుంటూ వస్తున్నా. ఇది నాకు పదో చిత్రం. నిఖిల్‌ అనేవాణ్ణి ఇంట్లోనే పెట్టేసి, కథనే నమ్ముకుంటున్నా. డైరెక్టర్స్‌ యాక్టర్‌ కావాలనుకుంటున్నా.

నాగార్జున గారు చెప్పారనే...

నాగార్జున గారు చెప్పారనే...

రిలీజ్‌ టైమ్‌ చాలా ముఖ్యమని నాగార్జునగారు అంటూ ఉంటారు. అందుకే మంచి టైమ్‌ కోసం ఆగాం. ఇప్పుడు మంచి తేదీ దొరకడంతో విడుదల చేస్తున్నాం.

అందుకే కొత్త దర్శకులతో ...

అందుకే కొత్త దర్శకులతో ...

‘స్వామి రారా' నుంచి కొత్త దర్శకులతోనే చేస్తున్నా. నాకు రాజమౌళిగారితో, వినాయక్‌గారితో చెయ్యాలని ఉంటుంది. కానీ వాళ్లకు నాతో చెయ్యడానికి కుదరదు కదా. అందుకే భవిష్యత్తులో వారిలాగా పేరుతెచ్చుకునే దర్శకులను పట్టుకోవడం నా డ్యూటీగా భావిస్తున్నా. పైగా కథ ఎంత బాగున్నా, నాకు సరిపోయే కథలనే ఎంచుకుంటున్నా.

అంతా కార్తికేయలే...

అంతా కార్తికేయలే...

కార్తికేయ సినిమాకి యాథృచ్ఛికంగా ఐదుగురు కార్తికేయలు పనిచేశారు. కథలో నా క్యారెక్టర్‌ పేరు కార్తిక్‌. అలాగే కెమెరామేన్‌, అసోసియేట్‌, స్క్రీన్‌ప్లే రచయిత మరో వ్యక్తి పేరు కార్తికేయలే.

శేఖర్ కమ్ములతో మళ్ళీ...

శేఖర్ కమ్ములతో మళ్ళీ...

నాకు సంబంధించి శేఖర్‌ కమ్ముల అనే వ్యక్తి చాలా ముఖ్యం. ఆయనే నాకు గుర్తింపును తెచ్చారు. మళ్లీ ఆయనతో కలిసి పనిచెయ్యాలని ఆశిస్తున్నా.

నెక్ట్స్ సినిమా...

నెక్ట్స్ సినిమా...

నా రాబోయే సినిమా ‘సూర్య వర్సెస్‌ సూర్య' రొమాంటిక్‌ కామెడీ. అంటే సినిమా ఏ తరహాదైనా కామెడీ కామన్‌. స్వామిరారా రొమాంటిక్‌ కామెడీ. కార్తికేయ హారర్‌ కామెడీ. తర్వాత చేస్తున్నది రొమాంటిక్‌ కామెడీ... నేనేం చేసినా కామెడీ కామన్‌. జోనర్‌ మాత్రం కొత్తగా మారుతుంటుంది. ప్రతిసారి ఒకే జోనర్‌ ప్రయత్నిస్తే చూసే ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది. అందుకనే ఎంపికల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X