రీషూట్ లు,గ్రాఫిక్స్ తోనే లేటు...ఇప్పుడు డేటిచ్చారు
హైదరాబాద్: సినిమా రిలీజ్ అనుకున్న తేదీన కాకుండా వాయిదా పడిందంటే సవాలక్ష అనుమానాలు ట్రేడ్ లోనూ, జనంలోనూ కలుగుతాయి. ఫైనాన్స్ ప్లాబ్లం అనో, బిజినెస్ కాలేదనో టాక్స్ మొదలవుతాయి. అయితే నిఖిల్, స్వాతి కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘కార్తికేయ' పరిస్ధితి అది కాదంటున్నారు. గ్రాఫిక్స్ తోనే లేటు అని చెప్తున్నారు. అయితే రీషూట్ లు కూడా చేసారని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా అక్టోబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించి, విడుదల తేదీ లాక్ చేసారు.
సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం రెండు గంటల ఆరు నిముషాల లెంగ్త్ ఉంది. శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్‌తో కూడిన వినొదాత్మక చిత్రంగా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు.

చిత్ర హీరో,హీరోయిన్స్ వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో.. ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు.. ఒక వేళ సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర హీరో 'నిఖిల్'ది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం.
ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, నాజర్, రావు రమేష్, ప్రవీణ్, తులసి, కిషోర్, స్వామిరారా సత్య, జోగినాయుడు, శివన్నారాయణ, మీనాకుమారి, చంద్రశేఖర్ గిరి, కృష్ణంరాజు, వేణుగోపాలరావు, ఐ కె. త్రినాధ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: కృష్ణ చైతన్య, కొరియో గ్రఫీ: రఘు, ఆర్ట్: సాహి సురేష్, కో డైరెక్టర్ :అను కె రెడ్డి, ఎగ్జిక్యుటివ్ నిర్మాత: గునకల మల్లికార్జున, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ, కధ - మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.


Click it and Unblock the Notifications











