నిఖిల్ ‘కార్తికేయ’ఫస్ట్ లుక్ ఇదే

By Srikanya

హైదరాబాద్ : గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'స్వామి రా రా'తో విజయాల బాట పట్టాడు నిఖిల్‌. ఇటీవల వైవిధ్యమైన కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం చేస్తున్నాడు. నిఖిల్, స్వాతి ల కార్తికేయ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్యాచ్ వర్కులతొ సహా ఈ సినిమా షూటింగ్ ను త్వరలో ముగించానున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. మీరు చూస్తున్నది అదే. చందూ మొందేటి దర్శకుడిగా పరిచయంకానున్నాడు. మాగ్నమ్ సినిమా ప్రైమ్ బ్యానర్ పై వెంకట్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

దేవాలయం నేపధ్యంలో వరుస మరణాల మిస్టరీ ని చేదించడానికి నిఖిల్ ఒక గ్రామానికి వెళ్తాడు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో విడుదలకానుంది. నిఖిల్ సిద్ధార్ధ, స్వాతీ తమ గత చిత్రం 'స్వామి రారా' విజయంతో చాలా ఆనందంగా వున్నారు. మరోసారి ఆ మ్యాజిక్ ను తెరపై ప్రదర్శించాలని కోరుకుంటున్నారు.

Nikil's Karthikeya Movie First Look

ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ చేసాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.

ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X