'శ్రీమంతుడు' స్ఫూఫ్ తో రిలీజ్ డే ట్రైలర్‌ (వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: నిఖిల్‌, నందిత, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన 'శంకరాభరణం' చిత్రం సరికొత్త ట్రైలర్‌ విడుదలైంది. నిఖిల్‌ ఈ విషయాన్ని తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

ఎం.వి.వి సినిమా పతాకంపై ఉదయ్‌ నందనవనం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్‌ సమర్పిస్తున్నారు. ఈ శుక్రవారం 'శంకరాభరణం' ప్రేక్షకుల ముందుకు రానుంది.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం' సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. 2 గంటల 26 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు సెన్సార్ వారు ‘యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసారు

ఈ చిత్ర యూనిట్ దీపావళి కానుకగా ప్రత్యేక టీజర్‌ని అభిమానుల కోసం విడుదల చేసింది. ఆ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఆ టీజర్ ని ఇప్పటికే చూడకపోతే మీరు ఇక్కడ చూడండి.

వినూత్నమైన కథతో బిహార్‌ నేపథ్యంలోని గ్యాంగ్స్‌, కిడ్నాపింగ్‌ తదితర అంశాలతో హాస్యాన్ని మేళవించి తెరక్కించారు. ఈ సినిమాని ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పిస్తుండగా, ఉదయ్‌ నందనవనం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు స్వరాలు అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X