నిఖిల్ 'సూర్య వర్సెస్ సూర్య' స్టోరీ లైన్ ...కొత్త ఫొటోలు
హైదరాబాద్: నిఖిల్ హీరోగా నటించిన చిత్రం 'సూర్య వర్సెస్ సూర్య' . త్రిధ హీరోయిన్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఈనెల 14న ఈ చిత్రంలోని గీతాల్ని విడుదల చేస్తారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ ఏంటనే ఆసక్తి అందరిలో క్రియేట్ అయ్యింది. ఇంతకీ స్టోరీ లైన్ ఏంటనేది దర్శకుడు తెలియచేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు మాట్లాడుతూ ''పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే సూర్య అనే కుర్రాడి కథ ఇది. తనకు సూరీడంటే భయం. ఆ యువకుడు వెలుగు చూడలేడు. అందుకే రాత్రుళ్లు బయటకు వస్తాడు. ఇలాంటి చిత్రమైన సమస్యతో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడో తెరపైనే చూడాలి. ఈ నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.
నిఖిల్ మాట్లాడుతూ.... అతని పేరు సూర్య. తనకు శత్రువు కూడా సూర్యనే. సూర్య అంటే వ్యక్తి కాదు. సౌరశక్తి. అదేనండీ.. సూర్యుడు. వీరిద్దరి మధ్య జరిగే కథే మా 'సూర్య వర్సెస్ సూర్య' అంటున్నారు నిఖిల్.
చిత్రం ఫొటోలు స్లైడ్ షోలో...

మరో విభిన్న చిత్రం
‘స్వామి రా రా', ‘కార్తికేయ' అంటూ విభిన్న చిత్రాలతో ముందుకు వెళ్తున్న నిఖిల్ మరో విభిన్న కాన్సెప్టు తో ముందుకు వస్తున్న చిత్రం సూర్య vs సూర్య'.
ఇప్పటికే
ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ ని మీరూ ఇక్కడ వీక్షించండి.

ఈ చిత్రం ద్వారా..
సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ముఖ్య పాత్ర
ఈ చిత్రంలో సూర్య అస్తమయం ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది

ఫస్ట్ లుక్ ని..
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి 2014 చివరి సన్ సెట్ కి మించిన మంచి సమయం లేదు అంటూ అప్పుడే ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు

కాన్సెప్టు కి తగినట్లే...
ఈ చిత్రం కాన్సెప్టుకు తగినట్లే .. పోస్టర్స్ కూడా విభిన్నంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటున్నాయి

బ్యాక్ డ్రాప్...
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. హ్యాపీడేస్ ఫీల్ ఉంటుందంటుున్నారు

కీలకపాత్రలో...
ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్..
‘హ్యాపీ డేస్' తర్వాత మరోసారి నిఖిల్ కాలేజ్ నేపధ్యంలో చేస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సూర్య vs సూర్య'.

గతంలో...
ఈ సినిమాతో ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘కార్తికేయ' సినిమాల సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఎవరెవరు
తనికెళ్ల భరణి, మధుబాల, రావు రమేష్, షాయాజీషిండే, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సత్య మహవీర్

నిర్మాణం
సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











