కామిక్ థ్రిల్లర్ ...(స్వామి రారా ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'స్వామి రారా' చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. ఈ చిత్రానికి హీరో నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రొమాంటిక్,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందని చెప్తున్నారు. చిత్రంలో వినాయకుడి విగ్రహానికీ, ఓ దొంగ ప్రేమ కథకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం అని దర్శక,నిర్మాతలు అంటున్నారు. ఈ చత్ర విజయం ఇటు హీరో నిఖిల్ కు,హీరోయిన్ కలర్స్ స్వాతికీ కీలకమే. ఇద్దరూ ప్లాప్ ల్లో ఉండటంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

సూర్య (నిఖిల్‌) ఓ జేబుదొంగ. బతుకుదెరువు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అతనికి స్వాతి (స్వాతి) అనే ఓ పాత్రికేయురాలితో పరిచయం అవుతుంది. మరోవైపు అనంతపద్మనాభస్వామి గుడిలో కనీవినీ ఎరుగని సంపద దొరుకుతుంది. అయితే అందులోంచి ఓ వినాయక విగ్రహం మాయం అవుతుంది. ఆ విగ్రహం కోసం కొంతమంది అన్వేషణ మొదలుపెడతారు. సూర్య, స్వాతిలు కూడా విఘ్నేశ్వరుడి కోసం వేట ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ విగ్రహం ఏమైంది? ఎవరికి దొరికింది? అనేదే చిత్ర కథ.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నేర పరిశోధన నేపథ్యంగా సాగుతుంది. నిఖిల్‌, స్వాతిల జంట చూడముచ్చటగా ఉంటుంది. తెరపై కనిపించే ప్రతి పాత్రకూ ఓ ప్రాధాన్యం ఉంటుంది. రవిబాబు విలన్ గా కనిపిస్తారు. అసలే దొంగ. ఆపై ప్రేమలో పడ్డాడు. ప్రేయసి కూడా.. 'దొరికిందంతా దోచేయ్‌.' అని ప్రోత్సహించే రకం. ఆ ఉత్సాహంలో మరింత రెచ్చిపోయాడు. కంటికి కనిపించిందల్లా జేబులోకి తోసేశాడు. వీరిద్దరూ కలసి చేసిన హంగామా ఎలాంటిదో తెలియాలంటే మా సినిమా చూడండి అన్నారు. సరదాగా సాగే ప్రేమకథ ఇది. నిఖిల్‌ అల్లరి నటన.. తప్పకుండా ఆకట్టుకొంటుంది.''అన్నారు.

సంస్థ: లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: నిఖిల్‌, స్వాతి, రవిబాబు, జీవా, ప్రవీణ్, పూజ తదితరులు.
సంగీతం: సన్ని
కెమెరా: రిచర్జ్ ప్రసాద్
ఆర్ట్: నాగేంద్ర
ఎడిటింగ్: ఎస్ఆర్ శేఖర్
పాటలు: కృష్ణచైతన్య
నిర్మాత: చక్రి చిగురుపాటి
రచన, దర్శకత్వం: సుధీర్‌ వర్మ
విడుదల: 22, మార్చి 2013.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X