స్టార్ డైరక్టర్ నుంచి "కొమురం పులి" హీరోయిన్ కి పిలుపు

By Srikanya

పవన్ కళ్యాణ్ సరసన 'కొమరంపులి' చిత్రంలో చేసిన నికిషపటేల్‌ కి ఆ తర్వాత ఆఫర్స్ ఏమీ రాలేదు.చిన్న చితకా చిత్రాల నుంచి ఆపర్స్ వచ్చినా ఆమె రిజెక్ట్ చేసింది. ఈ నేపధ్యంలో ఆమెకు బాలీవుడ్ స్టార్ డైరక్టర్ సుభాష్ ఘయ్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె చేయబోయే పాత్ర గురించి ఘాయ్‌ నికిషకి చెప్పేశారు. నికిష తనకు లభించిన అవకాశాన్ని అంది పుచ్చుకుంది. కేవలం గ్లామర్‌కు మాత్రమే కాకుండా కథకి, క్యారక్టర్‌కి ప్రాధాన్యత నిస్తానని నికిష చెబుతోంది. అందువల్లే ఇతర భాషా చిత్రాల నుండి అవకాశాలు వచ్చిన అంగీకరించలేదని చెప్తోంది. ఇక కొమురం పులి చిత్రం చేసిన తర్వాత నిఖిష ఓ లీడింగ్ న్యూస్ పేపరుతో తన గోడు వెళ్ళబోసుకుంది. పులి ప్లాపుతో నేనే నాశనమయ్యాను..పవన్ బాగానే ఉన్నారు..ఆయన ఇంకో సినిమాలో అప్పుడే బిజీ అయ్యారు. ఎస్.జె.సూర్య..దర్శకుడుగా కంటిన్యూ అవుతున్నారు. ఎటొచ్చీ నా రెండున్నరేళ్ళ కెరీర్ పాడయింది. ఈ సినిమా సంతకం పెట్టేడప్పుడు ఈ చిత్రం రిలీజయితే చాలా ఆఫర్స్ వస్తాయనుకున్నాను. షూటింగ్ లో ఉండగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ నన్ను తమ కొత్త చిత్రాల కోసం సైన్ చేయమని అడిగారు.అయితే రిలీజయ్యే వరకూ వేరే చిత్రం ఒప్పుకోవద్దని ఈ పులి చిత్రం వారు చెప్పారు. ఇప్పుడు సినిమా చూస్తే ఇలా దారుణంగా ఫెయిలైంది అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X