నిజాయితీకి మారు పేరు పవన్ కల్యాణ్
నిజాయితీ అంటే ఎలా ఉంటుందో పవన్ కల్యాణ్‌ని చూసే నేర్చుకోవాలి అంటోంది నికీషా పటేల్. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫిలిం..కొమరం పులి లో ఆమె పవన్ సరసన పోలీస్ ఆఫీసర్ గా చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి పై విధంగా స్పందించింది. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. అందర్నీ గౌరవించే మనస్తత్వం ఆయనది. అనవసరంగా ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరు. అవసరమైతే సలహాలు ఇచ్చేవారు. అంతే కానీ స్టార్ హీరో అనే హోదా ఎప్పుడూ చూపించలేదు. మామూలుగా ఎంత సరదాగా ఉంటారో..నటన విషయానికొచ్చేసరికి అంత ప్రొఫెషనల్‌గా మారిపోతారు. చాలా నిరాడంబరంగా గడుపుతారు. తొలి చిత్రమే పవన్ లాంటి గొప్ప నటుడితో నటించడం ఆనందంగా ఉంది అంటోంది.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ నిఖీషా పటేల్ పులి ఎస్ జె సూర్య ఎ ఆర్ రహమాన్ nikisha patel pawan kalyan puli ar rahman sj surya


Click it and Unblock the Notifications











