ఐటం సాంగ్స్ లో నటించటమనేది ఇప్పడు హీరోయిన్లు అందరూ గొప్ప అవకాశంలా భావిస్తున్నారు. అదే కోవలో సంబరం, కళ్యాణ రాముడు సినిమాల హీరోయిన్ నిఖిత 'కాళిదాస్' లో ఐటం గరల్ గా మెరవబోతోంది. వరస ఫ్లాపుల తో వెలిగిపోతున్న ఆమె కెరిర్ 'మహారాజశ్రీ' సినిమాతో మరింత మరుగున పడిపోయింది. కాని లక్కీగా అనసూయ, డాన్ లలో చేసిన కీలకమైన పాత్రలు ఆమెను కొంతవరకు కాపాడాయి. దాంతో నాగార్జున మేనల్లుడు సుశాంత్ పరిచయమవుతున్న సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆమె నర్తించింది. చాలా గ్లామర్ గా కనపడబోతోందిట. ఒకప్పడు అవకాశాలు లేని హీరోయిన్లు ఐటం నంబర్లలో కనపడి తళుక్కుమనే వారు. తమ ఉనికిని చాటుకోవటానికి అదో అవకాశంలా భావించేవారు. ఇప్పడు నయనతార, శ్రియ వంటి టాప్ హీరోయిన్లు కూడా ఈ రేసులోకి వచ్చేయటంతో వీటికి బాగా క్రేజ్ బాగా పెరిగింది. దాంతో రోజూకో హీరోయిన్ ఐటం సాంగ్ న్యూస్ వస్తోంది. ఇవి ఎలా ఉన్నా మరిచిపోతున్న అందాలను మరోసారి తెరపై చూసే అవకాసం ప్రేక్షకులకు కలగటం అదృష్టమే కదా
Story first published: Sunday, May 17, 2026, 4:19 [IST]