రొమాంటిక్ చిత్రాల స్ధాయికి దిగిపోయిన నిఖిత

By Srikanya

సంబరం, కళ్యాణరాముడు, ఏవండోయ్ శ్రీవారు, నీ నవ్వే చాలు వంటి చిత్రాలలో నటించి ఆ తర్వాత వరస ఫ్లాప్ లు ఇచ్చి కనుమరగైపోయిన నిఖిత తాజాగా 'అపార్ట్‌మెంట్" అనే చిత్రంలో చేస్తోంది. నిఖిత ప్రధాన పాత్రలో శ్రీ క్రియేటివ్ ఫిలిం పతాకంపై వి.రాజేష్ దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ రావ్, సతీష్ కె.వి., వేగేశ్న సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ- సస్పెన్స్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. రక్ష, ఉత్తేజ్, రవివర్మ, ఎం.ఎస్.నారాయణ, చిన్న, విజయసాయి, సుబ్బరాజు, అల్లరి సుభాషిణి, శ్రీకర్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాబూ జేమ్స్, సంగీతం: ఖుద్దూస్, నిర్మాతలు: ఎ.కె.శ్రీకాంతరావు, సతీష్ కె.వి. వేగేశ్న, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.రాజేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X