క్షమాపణ చెప్పలేదని బాధ పడుతోంది

By Srikanya

దర్శన్ గానీ, ఆయన భార్య విజయలక్ష్మి గానీ తనకు క్షమాపణ చెప్పలేదని హీరోయిన్ నిఖిత అన్నారు. కన్నడ నటుడు దర్శన్, ఆయన భార్య విజయలక్ష్మికి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. విజయలక్ష్మి తన భర్తకు, నిఖితకు మధ్య వివాహేతర సంబంధం ఉందనీ, ఈ కారంణం గానే దర్శన్ మద్యం సేవించి తనను రోజూ వేధిస్తున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యా దు చేసారు. దాంతో ఈ విషయం మీద చాలా వివాదం జరిగి చివరకు...నిర్మాతల మండలి నటి నిఖితపై నిషేధం విధించింది. నిఖితపై నిషేధాన్ని ఖండిస్తూ పలువురు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో నిర్మాతల మండలి నిషేధాన్ని వెనక్కి తీసుకుంది. అనంతరం విజయలక్ష్మి తన భర్త దర్శన్‌పై ఫిర్యాదును వాపస్ తీసుకుంది. ఆమె నటి నిఖితకు, దర్శన్‌కు క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై నిఖితను మీడియాను ప్రశ్నించగా ఇంతవరకూ తననెవరూ క్షమాపణ కోరలేదని స్పష్టం చేశారు. వాళ్లిద్దరూ మళ్లీ ఒకటవడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఒక మహిళగా సాటి మహిళ మానసిక స్థితిని ఆమె అర్థం చేసుకోవాలని కోరారు. నిర్మాతల మండలి నిషేధం విధించిన సమయంలోనే విజయలక్ష్మి స్పందించి ఉంటే తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చేవి కావన్నారు.

ఇక అప్పట్లో... నాపై నిషేధం విధించి నన్ను మెంటల్‌గా అప్‌సెట్ చేసినందుకు కన్నడ నిర్మాతల నుంచి నష్టపరిహారం కోరుతా. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తా. ఈ విషయాన్ని అంతతేలికగా వదలను'' అంటోంది నికిత.కన్నడ నటుడు దర్శన్ విషయంలో ఇటీవల కన్నడ నిర్మాతల మండలి నికితపై మూడేళ్ళ పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నికితకు కన్నడ నటులు, దర్శకుల నుంచి మద్దతు లభించడంతో కన్నడ నిర్మాతలు నిషేధం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఇలా స్పందించింది. అలాగే కన్నడ నిర్మాతలు నా మీద ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు. మూడేళ్ళ పాటు కన్నడ సినీ పరిశ్రమకు రాకుండా నిషేధం విధించారు. ఆ తరువాత విరమించుకున్నారు. ఇవన్నీ నన్ను ఎంతో బాధించాయి. నిరాధారాలతో నన్ను మానసిక క్షభకు గురిచేశారు. ఇది నా పెళ్ళిపై కూడా ప్రభావం చూపనుంది అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X