రొమాన్స్ చేసినా...ఆ హీరోయిన్ నాకు చెల్లి లాంటిదే
నిక్కి గల్రాని తనకు చెల్లిలాంటిదని శ్రీశాంత్ తెలిపారు. శ్రీశాంత్ నటిస్తున్న టీమ్ 5 సినిమాలో నిక్కి హీరోయిన్ గా చేస్తోంది.
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ క్రికెట్ కు దూరమైన తర్వాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీశాంత్ హీరోగా 'టీమ్ 5' అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రీశాంత్ సరసన నిక్కీ గల్రాని హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిక్కి గల్రాని గురించి శ్రీశాంత్ చేసిన కామెంట్ అందరినీ ఆశ్చర్య పరిచింది. తనకు ఇది తొలి చిత్రమని, నిక్కీ గల్రాని ఇప్పటికే 25 చిత్రాలకు పైగా నటించారని... ఈ చిత్రంలో ఆమె తనతో రొమాన్స్ చేసినప్పటికీ తనకు చెల్లెలితో సమానమని అన్నారు.

'టీమ్ 5' చిత్రం తెలుగులో జులై 14న విడుదల కాబోతోంది. క్రికెట్లో తన పదునైన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన శ్రీశాంత్ ఇప్పుడు వెండితెరపై బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు.
బైక్ రేసర్స్ అయిన ఐదుగురు స్నేహితుల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీశాంత్. నిక్కీ గల్రానీ, పార్లే మానే, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటిస్తున్నారు. బ్యానర్ - సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్, సంగీతం - గోపి సుందర్, ఎడిటర్ - దిలిప్ డెన్నిస్, ఆర్ట్ - సాహస్ బాల, డైరెక్టర్ - సురేష్ గోవింద్, ప్రొడ్యూసర్ - రాజ్ జకారియా.


Click it and Unblock the Notifications











