ఆది ప్రేయసికి కరోనా.. సొంత అనుభవాలతో సూచనలు.. ఎంతో లక్కీ అంటూ నిక్కి!
ప్రస్తుతం కరోనా ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో కరోనా తాండవం చేస్తోండగా.. మహారాష్ట్ర, తమిళ నాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో దావానంలా వ్యాప్తి చెందుతోంది. ఇక టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ కరోనా వ్యాప్తి చెందింది. ఉపాధి కోల్పోయిందని, పని కల్పించాలని షూటింగ్‌లు ప్రారంభించడంతో కరోనా రోజురోజుకు వ్యాప్తి చెందుతోంది. సినీ పెద్దలకు సైతం కరోనా సోకుతోంది. తాజాగా ఓ హీరోయిన్‌కు సైతం కరోనా సోకింది.

సెలెబ్రిటీలకు కరోనా..
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ నుంచి.. రాజమౌళి, విశాల్ వంటి వారికీ కరోనా సోకింది. వీరంతా చికిత్స తీసుకుని కరోనాను జయించారు. అయితే రోజుకు ఎవరో ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ నిక్కీ గల్రానీ కూడా కరోనా బారిన పడింది. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో ఫేమస్ అయిన నిక్కీ.. ఆది పినిశెట్టితో ఎఫైర్ బాగా ఫేమస్ చేసింది.

అవసరం ఉంటేనే బయటకు వెళ్లండి...
నా వయసు, నాకు ఆరోగ్యం బాగానే ఉండటంతో త్వరలోనే దీని నుంచి బయటపడతానని ఆశిస్తున్నాను. నా తల్లిదండ్రుల గురించి ఆలోచించినప్పుడు నాకు భయం వేస్తుంది. పెద్దవారు, స్నేహితులకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కాబట్టి అందరూ మాస్క్ ధరించండి. ఏదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్లండి.


Click it and Unblock the Notifications











