‘బూతులు, ఎక్స్‌పోజింగ్ లేదని అంటే.. కంటెంట్ నమ్మి అలా చేశాం’

తెలుగు సినిమా రంగంలో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు ప్రేక్షకులు ఇటీవల కాలంలో బ్రహ్మరథం పడుతున్నారు. మంచి కంటెంట్‌తో వచ్చిన మూవీస్‌ను భారీ హిట్ చేయడం తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్ల వర్షం కురిపించాయి. గత కొన్ని నెలలుగా స్టార్ వాల్యూను పక్కన పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలకు ఆడియెన్స్ పట్ట కడుతున్న నేపథ్యంలో సృజనాత్మకత ఉన్న దర్శక, నిర్మాతలు అలాంటి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. అలాంటి కోవలో వస్తున్న చిత్రమే నిలవే. ఈ సినిమా ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినిమా యూనిట్ తమ సినిమా గురించి మాట్లాడారు. ఈవెంట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పాయింట్ ఆఫ్ వ్యూ (POV) ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాడి నిర్మించిన చిత్రం నిలవే. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత నటించిన ఈ సినిమాకు సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ, తాహెర్ సినీ టెక్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. కల్యాణ్ నాయక్ సంగీతం, దిలీప్ కుమార్ సినిమాటోగ్రఫి, సత్య జీ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. అయితే ఈవెంట్‌లో పాత్రల్ని పరిచయం చేస్తూ ఈ సినిమా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ..

Nilave is Musical Love Drama

నిలవే మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందింది. ఈ సినిమాలో పాత్రల మధ్య ఆకట్టుకొనే డ్రామా ఉంటుంది.ఈ చిత్రంలో అంతా కొత్త వాళ్లమే నటించాం. మంచి సినిమా అందించాలని నిజాయితీతో పనిచేశాం. మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారనే విషయంపై క్యూరియాసిటీ ఉంది. ఆడియెన్స్ తప్పకుండా ఫీల్ అవుతారు. మీడియా సహకారం అందిస్తే.. మా సినిమా ఆడియెన్స్‌కు చేరువ అవుతుంది అని హీరో సౌమిత్ రావు అన్నారు.

నిలవే సినిమా టీమ్ గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. మా సినిమా కథ, కాన్సెప్ట్ పెద్దగా ఉంటుంది. అందమైన ప్రేమకథను తెరకెక్కించాం. ఓ వ్యక్తి జీవితంలో జరిగే భావోద్వేగమైన ప్రయాణమే నిలవే. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే లవ్ స్టోరీలు భారీ విజయాలు అందుకొన్నాయి. ఈ సినిమా సీన్లలో ఎక్స్‌పోజింగ్ లేదు, డైలాగ్స్ బూతులేవు. కంటెంట్ వైరల్ కాదు అని చాలా మంది అన్నారు. వాటిని పట్టించుకోకుండా కంటెంట్ మాత్రమే నమ్మాం. ఆ నమ్మకంతోనే టీజర్ కట్ చేశాం. మా సినిమాకు సపోర్ట్ చేయండి అని దర్శకుడు సౌమిత్ రావు అన్నారు.

Nilave is Musical Love Drama

నిలవే సినిమాకు ముందు నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయినా నా మీద నమ్మకంతో ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమాలో మ్యూజిక్ కొత్తగా ఉంటుంది. కథ నుంచే మంచి సంగీతం పుట్టిందని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా అవుతుంది అని మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ నాయక్ అన్నారు.

మ్యూజిక్ విన్న తర్వాత విజువల్స్ చేయడం ఛాలెంజ్ అనిపించింది. ఈ సినిమా కంటెంట్ అందరికి నచ్చతుంది. ఈ కాన్సెప్ట్ గురించి అందరూ మాట్లాడుకొంటారు అని కెమెరామెన్ దిలీప్ కే కుమార్, లిరిక్ రైటర్ ఎమ్‌వీ ఎస్ భరద్వాజ్, లిరిక్ రైటర్ కోటి అన్నారు. ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

More from Filmibeat

Read more about: Nilave Sai Vennam Sowmith Rao
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X