twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో సూర్య, కట్టప్ప, శ్రీప్రియ అండ్ కో కు నాన్ బెయిల్ బుల్ వారెంట్లు !

    పాత్రికేయులను అసభ్యంగా దూషించారని, అవమానకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ నమోదైన కేసులో బహుబాష నటుడు, హీరో సుర్యా, సత్యరాజ్(కట్టప్ప) తో సహ 8 మంది నటీ, నటులకు తమిళనాడులోని నీలగిరి క్రిమినల్ కోర్టు.

    |

    చెన్నై: పాత్రికేయులను అసభ్యంగా దూషించారని, అవమానకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ నమోదైన కేసులో బహుబాష నటుడు, హీరో సుర్యా, సత్యరాజ్(కట్టప్ప) తో సహ 8 మంది నటీ, నటులకు తమిళనాడులోని నీలగిరి క్రిమినల్ కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ చేసింది.

    కేసు విచారణకు కచ్చితంగా హాజరుకావాలని నీలగిరి క్రిమినల్ కోర్టు న్యాయమూర్తులు సెంథిల్ కుమార్, రాజవేల్ 8 మంది నటీ, నటులకు మంగళవారం నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ చేశారు. 2009లో పలువురు తారలకు మద్దతుగా మాట్లాడినందుకు ఇప్పుడు 8 మంది నటీ, నటులు కోర్టు ముందు హాజరుకావడానికి సిద్దం అవుతున్నారు.

    వ్యభిచారం కేసులో నటి అరెస్టు

    వ్యభిచారం కేసులో నటి అరెస్టు

    2009లో నీలగిరి జిల్లాలోని ఊటీలో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రాలపై స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఆ సందర్బంలో అలనాటీ ప్రముఖ అందాల భామ, నటి భువనేశ్వరి సైతం వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. నటి భువనేశ్వరిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

    తారల పేర్లు బయట పెట్టారు

    తారల పేర్లు బయట పెట్టారు

    నటి భవనేశ్వరితో పాటు అనేక మంది తారలు వ్యభిచారం చేస్తున్నారని ప్రముఖ తమిళ పత్రిక దినమలర్ ఓ కథనం ప్రచురించింది. నటి భువనేశ్వరి అరెస్టు అయిన మరుసటి రోజు తమిళ పత్రిక దినమలర్ లో ఆ కథనం ప్రచురించడంతో తమిళనాడులో సంచలనం రేపింది.

    వీరు వ్యభిచారం చేస్తున్నారని

    వీరు వ్యభిచారం చేస్తున్నారని

    నటి భువనేశ్వరితో సహ అలనాటి అందాల తారలు మంజుల, శ్రీప్రియతో సహ అనేక మంది వ్యభిచారం చేస్తున్నారని, వారి జాబితా అదే అంటు కొందరి పేర్లు దినమలర్ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయంపై తమిళ నటీ నటుల సంఘం భగ్గుమంది.

    విరుచుకుపడిన నటీ నటులు

    విరుచుకుపడిన నటీ నటులు

    వ్యభిచారం చేస్తున్నారంటూ ఆరోపిస్తు దినమలర్ పత్రిక తారల పేర్లు బహిరంగంగా ప్రచురించడంతో నటీ నటుల సంఘం మండిపడింది. కొందరు పాత్రికేయులు నీతిమాలిన మనులు చేస్తున్నారని, డబ్బు కోసం, ప్రచారం కోసం ఆశపడి ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని విమర్శించారు.

    సూర్య, కట్టప్ప అండ్ కో

    సూర్య, కట్టప్ప అండ్ కో

    దినమలర్ ప్రచురించిన కథనంపై 2009లో ప్రముఖ నటుడు సూర్య, మంజుల, ఆమె భర్త, బహుబాష నటుడు విజయ్ కుమార్, వీరి కుమారుడు అరుణ్ విజయ్, అలనాటి నటి శ్రీప్రియ, సత్యరాజ్ (కట్టప్ప), నటుడు, దర్శకుడు చేరన్, హాస్య నటుడు వివేక్ విలేకరులను బహిరంగంగా విమర్శించారని ఆరోపణలు ఉన్నాయి.

    ఊటీలో కేసు నమోదు

    ఊటీలో కేసు నమోదు

    తమను బహిరంగంగా విమర్శించారని ఆరోపిస్తూ 2009లో పాత్రికేయుడు రోసారియో ఊటీలో కేసు నమోదు చేశారు. సూర్య తదితరుల మీద కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసు విచారణకు ఒక్క సారి కూడా ఈ 8 మంది నటీ, నటులు హాజరుకాలేదు.

    వారెంట్లు జారీ చేసిన కోర్టు

    వారెంట్లు జారీ చేసిన కోర్టు

    సూర్య, సత్యరాజ్, విజయ్ కుమార్, వివేక్, చేరన్, శ్రీప్రియ, అరుణ్ విజయ్, మంజుల (మరణించారు) కోర్టు ముందు హాజరుకావాలని నీలగిరి క్రిమినల్ కోర్టు న్యాయమూర్తులు సెంథిల్ కుమార్, రాజవేల్ నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ చేశారు. నటీ, నటులకు వారెంట్లు జారీ చెయ్యడానికి స్థానిక పోలీసులు సిద్దం అయ్యారు.

    English summary
    Nilgiris Criminal Court has issued a non bailable warrant for eight actors including actor Surya. The Nilgiris Criminal Court has issued this order because they didnt appeared in the case of slanderous journalists.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X