న్యాయం చేయాలి...నేనింతే భాధితుల నిరాహారదీక్ష
సినిమా ఫ్లాప్ అయినా నేనింతే చిత్రంతో అవార్డులు వచ్చాయి సంతోషపడుతున్న పూరీకి ఇప్పుడో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆ చిత్రాన్ని అనంతపురం జిల్లాలో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ తాజాగా తాము నష్టపోయామని న్యాయం చేయవలిసిందని నిరాహారదీక్షకు దిగారు. అనంతపురం జిల్లాలో 'నేనింతే' సినిమాని పంపిణి చేసిన లవకుమార్..హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకి దిగారు. తమకు న్యాయం చేసేదాకా విరమించేది లేదంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ పేరు లవ కుమార్. ఆయన మాట్లాడుతూ 'ఈ సినిమాని కొని మేము పూర్తిగా నష్టపోయాం, కమర్షియల్ సినిమా తీసామని చెప్పి, తీరా వాళ్ళ జీవిత చరిత్ర తీసి, మా కొంప ముంచారని,' అంటున్నారు.అయితే దీనికి ఫిల్మ్ ఛాంబర్ తాము ఈ విషయంలో ఇనవాల్వ్ కాలేమంటోంది. ఛాంబర్ సెక్రటరీ కె.శేఖర్ బాబు మాట్లాడుతూ..లవకుమార్ ఛాంబర్ లో సభ్యుడు కాదు కాబట్టి తాము ఈ కేసుని సాల్వు చెయ్యలేమని అన్నారు.


Click it and Unblock the Notifications











