»   » పవన్ కళ్యాణ్‌‌ను దాటేసి ఎన్టీఆర్‌తో సమానంగా హీరో నాని!

పవన్ కళ్యాణ్‌‌ను దాటేసి ఎన్టీఆర్‌తో సమానంగా హీరో నాని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస విజయాలు అందుకుంటూ దూసుకెలుతున్న హీరో నాని ఇటీవల విడుదలైన 'నిన్ను కోరి' సినిమాతో మరో విజయాన్ని నమోదు చేశారు. ఈ సినిమా విజయంతో కేవలం డబల్ హాట్రిక్ కొట్టడం మాత్రమే కాదు.... కొన్ని రికార్డులు సైతం తన ఖాతాలో వేసుకున్నాడు ఈ నేచురల్ స్టార్.

తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు సైతం సాధించలేనివి నాని సాధిస్తున్నాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినది విదేశాల్లో ఉండే తెలుగువారి అభిమానం సంపాదించడం, ఓవర్సీస్ మార్కెట్లో తన సినిమాలకు భారీ వసూళ్లు వచ్చేలా మేనేజ్ చేయడం.

ఓవర్సీస్‌లో ప్రత్యేకమైన పరిస్థితి

ఓవర్సీస్‌లో ప్రత్యేకమైన పరిస్థితి

కొందరు స్టార్ హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కేవలం మాస్ ఎలిమెంట్స్ ఉండి నాలుగు ఫైట్లు, ఐదు పాటలు ఉంటే ఆడేస్తాయి. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పోలిస్తే ఓవర్సీస్‌లో ఉండే తెలుగు వారి అభిరుచి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇలాంటి రోటీన్ సినిమాలను వారు నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. సినిమాలో మంచి కంటెంటు ఉండి, రొటీన్‌కు భిన్నంగా తప్ప అక్కడ సినిమాలు ఆడే పరిస్థితి లేదు.

ఆ కొందరిలో ఒకడిగా ఎదిగిన నాని

ఆ కొందరిలో ఒకడిగా ఎదిగిన నాని

ఓవర్సీస్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు కొందరు మాత్రమే. అందులో నాని ఒకరు. తన సినిమా ఎప్పుడు వస్తుందా అని ఓవర్సీస్ ప్రేక్షకులు ఎదురు చూసే స్థాయికి నాని ఎదిగిపోయాడు.

మిలియన్ డాలర్ క్లబ్

మిలియన్ డాలర్ క్లబ్

‘నిన్ను కోరి' సినిమాతో నాని మరోసారి యూఎస్ఏలో మిలియన్ డాలర్ క్లబ్ లో చోటు దక్కించుకున్నాడు. మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న 4వ సినిమా ఇది. ఇంతకు ముందు నాని నటించిన ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్ చిత్రాలు మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయి.

పవన్ ను దాటేసి, ఎన్టీఆర్ తో సమానంగా

పవన్ ను దాటేసి, ఎన్టీఆర్ తో సమానంగా

‘నిన్ను కోరి' సినిమా మిలియన్ క్లబ్ లో చేరడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సమానమైన స్థాయికి చేరాడు నాని. ఎన్టీఆర్ నటించిన 4 సినిమాలు బాద్ షా, టెంపర్, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో చిత్రాలు 1 మిలియన్ మార్కను అందుకున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం 3 సినిమాలతో వెనక పడ్డారు. ఆయన నటించిన గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల చిత్రాలు 1 మిలియన్ సాధించాయి.

English summary
'Ninnu Kori' is the 4th film in Nani's career to collect $1 million or more in USA. Earlier, 'Eega', 'Bhale Bhale Magadivoy' and 'Nenu Local' managed this feat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X