నాగార్జున సూపర్ హిట్ సాంగ్ మళ్ళీ వచ్చేసింది.. దుమ్మురేపేసిన చైతు, నిధి అగర్వాల్!

Recommended Video

Ninnu Road Meeda Song Trailer From Savyasachi Movie

కింగ్ నాగార్జున 90వ దశకంలో నటించిన హిట్ చిత్రం అల్లరి అల్లుడు గుర్తుందిగా. ఈ చిత్రానికి కోందండరామిరెడ్డి దర్శకుడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో యువతని ఒక ఊపుఊపాయి. ముఖ్యంగా నిన్ను రోడ్డు మీద చూసినది లాగయిత్తు అనే సాంగ్ అంటే యువత ఇప్పటికి చెవి కోసుకుంటుంటారు. రీమిక్స్ రూపంలో ఆ సాంగ్ మళ్లీ అలరించడానికి మన ముందుకు వచ్చేసింది. నాగ చైతన్య నటిస్తున్న సవ్యసాచి చిత్రంలో కీరవాణి ఈ సాంగ్ ని రీమిక్స్ చేశారు. తాజగా వీడియో ప్రోమో విడుదల చేశారు.

ఆసక్తి రేపుతున్న సవ్యసాచి

ఆసక్తి రేపుతున్న సవ్యసాచి

నాగ చైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న సవ్యసాచి చిత్రం నవంబర్ 2 న విడుదల కాబోతోంది. దర్శకుడు చందూ ముండేటి ఈ చిత్రాన్ని ట్విన్ సిండ్రోమ్ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. చైతూ కెరీర్ లోనే ఏ చిత్రానికి అత్యధిక ప్రీ రిలీజ్బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో సవ్యసాచిపై అంచనాలు పెరిగాయి.

రోడ్డు మీద చూసినది లాగయిత్తు

రోడ్డు మీద చూసినది లాగయిత్తు

అల్లరి అల్లుడు చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ నిన్ను రోడ్డుమీద చూసినది లాగయిత్తు రీమిక్స్ వర్షన్ తాజాగా విడుదల చేశారు. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా కీరవాణి ఈ పాటని మరింత హెహుషారైన సంగీతంతో రూపొందించారు. ఈ సాంగ్ లో నాగ చైతన్య, నిధి అగర్వాల్ డాన్స్ పెర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచింది. చైతు ఎన్నడూ లేని విధంగా ఈ సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులతో అలరిస్తున్నాడు.

అందాల నిధిలాగా

నిధి అగర్వాల్ తానేం తక్కువ కాదంటూ ఓ వైపు గ్లామర్ తో మెప్పిస్తూనే గమ్మత్తైన స్పెప్పులతో అలరించింది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సాంగ్ కు డాన్స్ కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ కు చైతు కృతజ్ఞతలు తెలియజేశాడు.

మైత్రి మూవీస్ నిర్మాణంలో

మైత్రి మూవీస్ నిర్మాణంలో


ఇటీవల టాలీవుడ్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పట్టిందల్లా బంగారంగా మారుతోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఈ ఏడాది విడుదలైన రంగస్థలం వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఈ సంస్థ నిర్మాణంలో వచ్చినవే కావడం విశేషం. సవ్యసాచి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ లో నిర్మించారు. చందు ముండేటి రూపొందించిన కథ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే సవ్యసాచి చిత్రం విజయం సాధించడం ఖాయం. ప్రముఖ నటుడు మాధవన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X