నిప్పై రగిలే హృదయమే.. సంచలన సినిమా తొలి సాంగ్ వచ్చేసింది!
ఒక చిన్న సినిమా అందరి దృష్టిని ఆకర్షించడం కష్టం. చాలా అరుదుగా చిన్న చిత్రాలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంటాయి. ఆ కోవలోకి చెందినదే ఆర్ ఎక్స్ 100 చిత్రం. విడుదలకు ముందే సినిమా యువతని ఆకర్షిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సంచలనం సృష్టించింది.

విభిన్నంగా ఉన్న సన్నివేశాలు, యువతని ఆకర్షించే రొమాంటిక్ సన్నివేశాలు ఈ చిత్రంలా పుష్కలంగా ఉన్నాయి. తాజగా ఈ చిత్ర తొలి సాంగ్ ని విడుదల చేసారు. సాంగ్ మొత్తం ఎమోషనల్ లిరిక్స్ తో ఉంటూ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహించారు.
కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











