రవితేజ ‘నిప్పు’ రిలీజ్‌పై ఇదే అసలు నిజం
మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా 'నిప్పు' విడుదలపై గత కొంత కాలంగా రకరకాల వాదనలు వినిపస్తున్న సంగతి తెలిసిందే. తొలుత సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలిచిందని ప్రచారం జరిగినా...కొన్ని కారణాల వల్ల విడుదల వీలు కాలేదే. ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో అని, ఫిబ్రవరి 2న విడుదల ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. దీంతో అభిమానులు, ప్రేక్షకుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్మాతలు ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు.
మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత వై.వి.ఎస్ చౌదరి ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నిప్పు సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో దీక్షసేథ్ హీరోయిన్ గా నటిస్తోంది. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈచిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తమన్ అందించిన సంగీతానికి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రవితేజ ఇమేజ్ కు తగిన విధంగా పూర్తి కమర్సియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











