‘నిప్పు’ ట్రైలర్ విడుదల
రవితేజ హీరోగా నటిస్తున్న 'నిప్పు' చిత్రం థియేటర్ ట్రైలర్ప్‌ను శనివారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వైవిఎస్ చౌదరి, దర్శకుడు గుణశేఖర్, యూనిట్ సభ్యలు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 17న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ...నిప్పు సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారని, ఆయనపై ప్రెషర్ పెట్టి పాటల కంపోజింగ్ పూర్తి చేయమని అడిగితే ఇంత క్వాలిటీగల ఆడియో వచ్చేది కాదు. అందుకే సినిమా వాయిదా వేసుకున్నాం. సినిమా సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చిందని, మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న సినిమాను విడుదల చేస్తున్నామని వైవిఎస్ చెప్పుకొచ్చారు. రవితేజ ఈ సినిమాలో సూర్య పాత్రలో నటిస్తున్నాడని, ఎలాంటి బాధ్యతలు లేని, ఎలాంటి లక్ష్యాలేని జులాయిలా ఉంటాడు. అయితే ఉన్నట్టుండి అతనిపై పెద్ద బాధ్యత వచ్చి పడుతుంది. ఈ క్రమంలో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని వైవిఎస్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రవితేజ 'దరువు' చిత్రంలో నటిస్తున్నాడు. సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా యమలోకం సెట్ వేశారు. ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రభు యమ ధర్మరాజుగా కనిపించనున్నాడు. శౌర్యం ఫేం శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సౌండ్ ఆఫ్ మాస్ అనే సబ్ టైటిల్ తో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయిక.


Click it and Unblock the Notifications











