‘నిప్పు’ గుణశేఖర్ సినిమా కాదు: వైవిఎస్ చౌదరి

నిప్పు సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారని, ఆయనపై ప్రెషర్ పెట్టి పాటల కంపోజింగ్ పూర్తి చేయమని అడిగితే ఇంత క్వాలిటీగల ఆడియో వచ్చేది కాదు. అందుకే సినిమా వాయిదా వేసుకున్నాం. సినిమా సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చిందని, మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న సినిమాను విడుదల చేస్తున్నామని వైవిఎస్ చెప్పుకొచ్చారు.
రవితేజ ఈ సినిమాలో సూర్య పాత్రలో నటిస్తున్నాడని, ఎలాంటి బాధ్యతలు లేని, ఎలాంటి లక్ష్యాలేని జులాయిలా ఉంటాడు. అయితే ఉన్నట్టుండి అతనిపై పెద్ద బాధ్యత వచ్చి పడుతుంది. ఈ క్రమంలో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని వైవిఎస్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











