twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నిప్పు’ గుణశేఖర్ సినిమా కాదు: వైవిఎస్ చౌదరి

    By Bojja Kumar
    |

    Ravi Teja-Dexishasad
    రవితేజ హీరోగా వస్తున్న 'నిప్పు' సినిమా గుణశేఖర్ మార్కు మూవీ అనుకుని వస్తే పప్పులో కాలేసినట్లే అంటున్నారు ఈ సినిమా నిర్మాత వైవిఎస్ చౌదరి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వైవిఎస్ మాట్లాడుతూ... గుణ శేఖర్ సినిమా అంటే భారీ సెట్లు, సిరీయస్ డ్రామా, మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయనే మాట వాస్తవమే. అయితే 'నిప్పు' మాత్రం గుణ శేఖర్ మార్కు సినిమా ఏమాత్రంకాదు. ఈ సినిమా కోసం గుణ శేఖర్ తన సహజ శైలిని పక్కన పెట్టి కొత్తగా రూపొందించారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఇది గుణశేఖర్ సినిమానా? అని షాకవ్వడం ఖాయం. గుణశేఖర్ స్టయిల్ కి పూర్తి విభిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది 100% రవితేజ మార్కు సినిమా అని స్పష్టం చేశారు వైవిఎస్ చౌదరి.

    నిప్పు సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారని, ఆయనపై ప్రెషర్ పెట్టి పాటల కంపోజింగ్ పూర్తి చేయమని అడిగితే ఇంత క్వాలిటీగల ఆడియో వచ్చేది కాదు. అందుకే సినిమా వాయిదా వేసుకున్నాం. సినిమా సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చిందని, మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న సినిమాను విడుదల చేస్తున్నామని వైవిఎస్ చెప్పుకొచ్చారు.

    రవితేజ ఈ సినిమాలో సూర్య పాత్రలో నటిస్తున్నాడని, ఎలాంటి బాధ్యతలు లేని, ఎలాంటి లక్ష్యాలేని జులాయిలా ఉంటాడు. అయితే ఉన్నట్టుండి అతనిపై పెద్ద బాధ్యత వచ్చి పడుతుంది. ఈ క్రమంలో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని వైవిఎస్ చెప్పుకొచ్చారు.

    English summary
    "Gunasekhar has kept aside his image to make this movie. Infact, I can confidently say that this movie will not be a Gunasekhar style movie. The audience will be shocked when they see the film. A totally new style of movie making from Gunasekhar will be the highlight of this movie. This is a 100% Ravi Teja mark movie." YVS Chowdhary told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X