twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్.నారాయణమూర్తి 'కలకత్తా కాళీ' లెటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    గోదావరిఖని: గోదావరిఖనిలోని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో కలకత్తా కాళీ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తి ఆదివారం చిత్రీకరించారు. యువతికి జరిగిన అన్యాయంపై పోలీసు అధికారుల పాత్రతో ముడిపడిన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. నారాయణమూర్తితో పాటు స్థానిక కళాకారులు కందుల పోశం, ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

    ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటన ఆధారంగా ఆర్‌.నారాయణమూర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించే ఈ చిత్రానికి 'కలకత్తా కాళీ' అనే పేరుని ఖరారు చేశారు. ఇక ఈ చిత్రానికి నిర్బయ భారతం ట్యాగ్ లైన్ గా పెడుతున్నారు. నారాయణ మూర్తి,తెలంగాణ శకుంతల ఈ చిత్రంలో కీలక పాత్రలు చేస్తున్నారు.

    ఇక ఈ చిత్రం అనంతరం... మావోయిస్టు అగ్రనేత దివంగత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ ఉద్యమ పోరాటాన్నీ తెరపైకి తీసుకురాబోతున్నట్లు నారాయణ మూర్తి తెలిపారు. కిషన్‌జీ జీవితం, చేపట్టిన ఉద్యమాన్ని అందులో చూపిస్తామనీ, తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం ఉంటుందనీ ఆయన చెప్పారు.

    ఇక ఈ మధ్యనే...ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'పీపుల్స్‌ వార్‌'. బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లకు వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది. సోంపేట, కాకరాపల్లి తదితర గ్రామాల ప్రజలు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని ఎంచుకొని రాసుకొన్న కథే ఇది. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులే ఇందులో హీరోలు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలే ఈ చిత్రంలో విలన్లు . శ్రీహరి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు.

    English summary
    R.Narayanamurthy is coming with a film on Delhi rape incident which shook the nation. The film is titled as 'Kalakatta Kali' and has a tagline Nirbhaya Bharatam. Currently shooting is on in Godavari Khani. Film makers shot few scenes at Illandu Guest House on Saturday and in one such scene shot Nirbhaya's final rites.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X