హీరోయిన్ నిషా అగర్వాల్ కంటతడి
హైదరాబాద్ : హీరోయిన్ నిషా అగర్వాల్ కంటతడి పెట్టింది. బిగ్ ఎఫ్ నిర్వహించిన మదర్స్ డే కార్యక్రమానికి హాజరైన నిషా ఎమోషన్ గురై కన్నీళ్లు పెట్టింది. ఈ కార్యక్రమానికి 'హెల్పింగ్ సొసైట్ వీకర్ సెక్షన్' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న సక్రిబాయి కూడా హాజరయ్యారు. సక్రిబాయి 1000 మంది అనాద పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు.
సక్రిబాయి అనాద పిల్లల కోసం పడుతున్న తపనను చూసి నిషా అగర్వాల్ కంటతడి పెట్టింది. ఈ కార్యక్రమంలో బుల్లితెర నటి మధుమణి కూడా హాజరయ్యారు. ఇకపై తాము కూడా అనాద పిల్లల కోసం తమ చేతనైన సాయం చేస్తామని నిషా అగర్వాల్ వెల్లడించింది.
ఇక నిషా సినిమాల విషయానికొస్తే.....నిషా-ఆది జంటగా రూపొందిన 'సుకుమారుడు' చిత్రం నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రం తొలిరోజే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా హిట్టవుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్న నిషా కాస్త నిరాశకు గురైందనే చెప్పాలి.
ప్రస్తుతం నిషా అగర్వాల్ చేతిలో దాదాపు నాలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి సందీప్ కొషన్ హీరోగా రూపొందుతున్న 'డీకె బోస్' చిత్రం కాగా, మరొకటి వరుణ్ సందేష్ తో చేస్తున్న సరదాగా అమ్మాయిలతో. దీంతో పాటు అలియాస్ జానకి చిత్రంలో కూడా ఆమె హీరోయిన్‌గా ఎంపికయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












