వాళ్ల వైపు ఆబగా చూస్తున్న కాజల్ చెల్లెలు
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ తెలుగులోని టాప్ యువ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల వైపు ఆబగా ఎదురు చూస్తోంది. వారితో సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టింది. అక్కలా మంచి పేరు తెచ్చుకోవాలి. అక్కతో కలిసి ఓ యాడ్‌లో నటించాను. ఈసారి పూర్తినిడివి చిత్రంలో నటించే ఛాన్స్ కోసం కూడా ఎదురుచూస్తున్నాను అని చెప్పింది.
ప్రస్తుతం నిషా 'సోలో" సినిమాలో నటిస్తోంది. నారా రోహిత్ హీరో. పరశురామ్ దర్శక్త్వం వహిస్తున్న ఈ సినిమాను వంశీ కృష్ణ నిర్మాస్తుండగా, మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 25న సోలో సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా గురించి నిషా మాట్లాడుతూ....రోహిత్‌తో ప్రేమ సన్నివేశాలు, సరస సన్నివేశాలు మెప్పిస్తాయన్నారు. నటన, సంగీతం, పతాకసన్నివేశం..సినిమాకి పెద్ద అస్సెట్స్. కాస్త తడబడినా..సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్‌తో వచ్చే సన్నివేశాల్లో బాగానే చేశాను. తననుంచి ఎంతో నేర్చుకున్నా. కళ్లు ఎలా తిప్పాలి? ముఖ కవలికలు ఎలా ఉండాలి..అన్నీ నేర్పారు. అవసరమైతే కొన్నిసార్లు సెట్స్‌నుంచే అక్క(కాజల్)కు ఫోన్ చేసి టిప్స్ తెలుసుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











