సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి సినిమా రీమేక్ లో కాజల్ చెల్లి....
కన్నడ 'మర్యాదరామన్న' లో కాజల్ చెల్లి నిషా అగర్వాల్ 'ఏమైంది ఈవేళ' చిత్రం తో వరుణ్ సందేష్ సరసన హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తరవాత నారా రోహిత్ తాజా సినిమా 'సోలో' లో కధానాయికగా ఎంపికయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది ఇప్పుడు ఈ అమ్మడు కన్నడం లో నటించబోతుంది.
మర్యాదరామన్న చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయనున్నారు, ఆ చిత్రం లో కోయిల్ కుమార్ కధానాయకుడు. నిషా అతనితో స్క్రీన్ ను పంచుకోనుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ ఫైకి వెళ్ళనుంది. కేవలం ఒక్క భాషకే పరిమతం కాకుండా సౌత్ అంతటా అవకాశాలు అందిపుచ్చుకోవటానికి కాజల్ దగ్గరుండి చెల్లి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంది. అంతే కాకుండా కలిసి కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంది.


Click it and Unblock the Notifications