twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగులో తొలిసారి నిషా..

    By Staff
    |

    రామ్‌గోపాల్‌ వర్మ దృష్టిలో పడకపోతే ఆ అమ్మాయి అందరి హీరోయిన్స్‌లాగే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోడానికి నానా తంటాలు పడవలసి వచ్చేది. కానీ.. నిషా కొఠారి టాలెంట్‌ గుర్తించి, వర్మ ఆమెను తొలిసారి సర్కార్‌లో చిన్న పాత్ర ఇచ్చారు. తర్వాత జేమ్స్‌ చిత్రంలో హీరోయిన్‌గా ప్రమోట్‌ చేశారు. ఇప్పుడు ఆయన తీసిన శివ-2006 చిత్రంలో కూడా నిషా కొఠారి తన అందాలతో యువతరం హృదయాలను మరోమారు కొల్లగొట్టడానికి వస్తోంది. అంతటి నిషా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించబోతోంది.

    బజ్జు ఆర్ట్స్‌ సంస్థ తాజాగా రూపొందిస్తున్న చిత్రంలో శ్రీరామ్‌ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు శ్రియ, నిషా కొఠారి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సంస్థ నిర్మాత ఎస్‌ కె బషీద్‌ హీరోయిన్స్‌ విషయంలో ఎక్కడా రాజీ పడేలా కనిపించడం లేదు. ఆయన తొలి చిత్రం అల్లరే అల్లరి ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. అందులో అల్లరి నరేష్‌, వేణు హీరోలు కాగా హీరోయిన్లుగా పార్వతి మెల్టన్‌, మల్లికా కపూర్‌ నటిస్తున్నారు.

    ఒక నూతన నిర్మాణ సంస్థ ఒకటి ప్రొడక్షన్‌లో ఉండగానే రెండో చిత్రం ప్రకటించడం విశేషమే. అల్లరే అల్లరి షూటింగ్‌ మొదలైన వెంటనే హీరో శ్రీరామ్‌తో తమ రెండో చిత్రం ప్రకటించారు నిర్మాత బషీద్‌. ఈ చిత్రానికి బొమ్మా - బొరుసా టైటిల్‌ని ఖరారు చేశారు. సెప్టెంబర్‌ 27న ముహూర్తపు షాట్‌ చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.

    ప్రతిష్టాత్మకమైన శివాజీ చిత్రం తర్వాత శ్రియ నటిస్తున్న తెలుగు చిత్రం ఇదే కావడం మరో విశేషం.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X