ఆమె నిషా దిగిపోయింది!!!
రామ్ గోపాల్ వర్మ కి ఆగ్ సినిమా ఫట్టుమనడంతో చాలామందికి...ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మకి జ్ఞానోదయమైంది. ఏకంగా తన క్రియేటివ్ స్టాఫ్ నే మార్చే పనిలో పడ్డాడు. వర్మ ఆస్థాన నటి నిషా కొఠారి... నిషా పూర్తిగా దిగిపోయింది. ఆత్మపరిశీలనలో పడింది. వర్మ కనుసైగలలో నడుచుకునే ఈ అమ్మడు కూడా మార్పులకు శ్రీకారం చుట్టింది. తన ఒరిజినల్ పేరును తిరిగి పెట్టుకునే పనిలో పడింది.
ఆమె అసలు పేరు ప్రియాంక కొఠారి. ప్రియాంక చోప్రా ఆల్ రడీ ఇండస్ట్రీలో ఉంది కదా అని వర్మానే ప్రియాంకను తీసేసి నిషాను తగిలించాడట. అయితే కొఠారి మాత్రం తన పేరులో నిషా ఉండడం మూలంగానే తనకు కలిసిరావడంలేదని ఒరిజినల్ పేరుకే సై అంటోంది. ఇక నుంచి తాను ప్రియాంక కొఠారి నంటోంది. ప్రియాంక పేరు మీద ఇప్పటికే ప్రియాంక చోప్రా ఉంది కదా అంటే....ఇషా డియోల్, ఇషా కొప్పికర్...అమృతా అరోరా అమృతారావు ఉండగా లేంది ప్రియాంకలు ఇద్దరు ఉంటే తప్పేంటని అంటోంది. సరే మరి ప్రియాంక కొఠారి.


Click it and Unblock the Notifications











