నా డ్రీమ్ హాండ్సమ్ మహేష్ బాబుతో నటించడమే..నిషా..!
టాలీవుడ్ లో అందరికన్నా అందగాడెవరని అడిగితే, ఇంకెవరూ..మహేషే..అంటోంది హీరోయిన్ నిషా అగర్వాల్. అక్క కాజల్ అగర్వాల్ పుణ్యమా అని 'ఏమైంది ఈవేళ" సినిమాత హీరోయిన్ అయిపోయిన నిషా, ప్రస్తుతం 'బాణం" చిత్రం హీరో రోహిత్ సరసన 'సోలో" సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే.
ఆన్ స్ర్కీన్ రోహిత్ చాలా ప్రొఫెషనల్ అనీ, షూటింగ్ గ్యాప్ లో మాత్రం చాలా సరదాగా వుంటాడని నిషా చెబుతోంది. 'సోలో" సినిమాతో నటిగా తన దశ తిరిగిపోవడం ఖాయమనీ, మహేష్ సరసన హీరోయిన్ గా నటించాలనేది తన డ్రీమ్ అనీ..నిషా చెప్పుకొచ్చింది ఓ ఇంటర్వ్యూలో. 'డార్లింగ్" లాంటి సినిమా..అదీ ప్రభాస్ తో చేయాలని వుందనీ, తన సోదరి నటించిన సినిమాల్లో 'డార్లింగ్" తనకు బాగా నచ్చిన సినిమా అనీ నిషా అగర్వాల్ అంటోంది.
ఎక్స్ పోజింగ్ అనేది సన్నివేశాన్ని బట్టి వుంటుందనీ, స్విమ్మింగ్ పూల్ లో చీర కట్టుకునో, జీన్స్ వేసుకునో దూకలేం కదా..అంటూ రొటీన్ గా ఎక్స్ పోజింగ్ గురించి సెక్సీ భామలంతా చెప్పే పాత డైలాగే వల్లించింది నిషా అగర్వాల్...


Click it and Unblock the Notifications











