అనుష్క అంకితభావం భేష్.. నిశ్శబ్దం ఓ మైలురాయిగా..

2005 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన 'సూప‌ర్' సినిమాతో ప్రారంభించి న‌టిగా అనుష్క ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైద‌రాబాద్‌లోఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌లో ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.

డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ, "అనుష్క ఒక నిగ్ర‌హం ఉన్న విగ్ర‌హం. రెండేళ్ల పాటు మాతో పాటు ఈ సినిమా కోసం త‌ను వెచ్చించ‌డం మామూలు విష‌యం కాదు. అది ఆమె అంకిత‌భావం. మాపై న‌మ్మ‌కం ఉంచినందుకు ఆమెకు థాంక్స్‌. ఈ ప‌దిహేనేళ్ల జ‌ర్నీలో ఆమె ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. వాటిలో 'నిశ్శ‌బ్దం' కూడా ఒక మైలురాయి లాంటి సినిమా లాగా నిల‌బ‌డుతుంద‌ని ఆశిస్తున్నా.

Nishabdham update: Hemanth Madhukar praises Anushka Shetty

అంజ‌లి కూడా ఇప్ప‌టి దాకా చేసిన క్యారెక్ట‌ర్ల‌కు చాలా భిన్న‌మైన క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో చేసింది. మాకు కావాల‌సిన అన్నింటినీ నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ గారు స‌మ‌కూర్చి పెట్టారు. ఆయ‌న స‌పోర్ట్ ఇవ్వ‌బ‌ట్టే ఈ సినిమాను నేను అనుకున్న‌ట్లు చేయ‌గ‌లిగాను" అన్నారు.

ప్ర‌స్తుతం అనుష్క ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న 'నిశ్శ‌బ్దం' ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X