Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అయిన తమన్నా.. ఎఫైర్ పాత్ర కోసం భారీ రిస్క్?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత పదేళ్లుగా తనదైన శైలిలో క్రేజ్ అందుకుంటున్న బ్యూటీ తమన్నా భాటియా. ఈ నార్త్ బ్యూటీ తమిళ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసినప్పటికీ ఎక్కువగా టాలీవుడ్ లోనే ఉంటుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంభంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న మిల్కి బ్యూటీ టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. ఇక నేటితరం కుర్ర హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది.
భారీ రిస్క్ చేయబోతున్న తమన్నా
తమన్నా తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక భారీ రిస్క్ చేయబోతోంది. ఇటీవల బాలీవుడ్ మూవీ అందాదున్ తెలుగు రీమేక్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. లాల్ డౌన్ లేకపోయి ఉంటే సినిమా. ఎప్పుడో సేట్స్ పైకి వచ్చేది. ఇక సినిమాలో మెయిన్ పాత్రలకు సంబంధించిన యాక్టర్స్ ని ఫిక్స్ చేసుకున్నారు.
టబు చేసిన ఆ పాత్ర కోసం..
ఆయుష్మాన్ ఖురానా కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అందాదున్ పై నితిన్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. సొంత ప్రొడక్షన్ లోనే సినిమాను నిర్మించాలని కూడా డిసైడ్ అయ్యాడు. ఇక సినిమాలో టబు చేసిన బోల్డ్ పాత్ర కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది హాట్ టాపిక్ అవుతున్న సమయంలో తమన్నా అంటూ అందరికి షాక్ ఇచ్చారు. హీరోయిన్ పాత్రలో నభా నటేష్ ని ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.
నచ్చక చాలా మంది రిజెక్ట్ చేశారు
ఒక పోలీస్ ఆఫీసర్ తో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి భర్తనే కడతేర్చే ఆ పాత్రలో టబు చాలా రియాలిటీగా నటించింది. ఇక తెలుగులో ఆ పాత్ర ఎలాంటి వారు సెట్టవుతారు అనేది గత కొంతకాలంగా చిత్ర యూనిట్ చాలా మందిని సంప్రదించింది. కొందరు పాత్ర నచ్చక రిజెక్ట్ చేస్తే మరికొందరు రెమ్యునరేషన్ అడిగినంత ఇవ్వలేదని రిజెక్ట్ చేశారు.
Recommended Video
రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అయిన తమన్నా
ఇక ఫైనల్ గా తమన్నా ఒక రేటుకి టెంప్ట్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ బోల్డ్ పాత్ర కోసం మిల్కీ బ్యూటీకి కోటిన్నరకు పైగా ఇస్తున్నారట. మొదట తమన్నా 2కోట్లకు పైగా డిమాండ్ చేసిందట. ప్రస్తుతం తమన్నా ఉన్న పరిస్థితులలో ఆ రేటు చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక తమన్నా కంటే హై రేంజ్ హీరోయిన్స్ దొరకడం కష్టమని చిత్ర యూనిట్ కూడా ఆమెతో బేరమాడి కోటిన్నరకు డీల్ సెట్ చేసుకుందని సమాచారం.