మరో సినిమాని లైన్లో పెడుతున్న నితిన్.. మైత్రి మూవీస్ బ్యానర్‌లో!
యువ హీరో నితిన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. లై, ఛల్ మోహన్ రంగ చిత్రాలు నిరాశపరిచినా నితిన్ దూకుడుకు అడ్డు కాలేకపోయాయి. నితిన్ ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. నితిన్ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రం విడుదల కాకముందే నితిన్ మరో చిత్రాన్ని లైన్ లో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతిభగల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి నితిన్ కోసం ఓ కథని సిద్ధం చేశారట. నితిన్ కు సరిపోయేలా చంద్రశేఖర్ ఏలేటి యాక్షన్ అంశాలతో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. నితిన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పూర్తవగానే ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

థ్రిల్లర్ చిత్రాలతో చంద్రశేఖర్ ఏలేటి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నితిన్ తో చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది.


Click it and Unblock the Notifications











