sp balasubrahmanyam.. ప్రతీ ఇంట్లో వినబడే గాత్రం.. ఎస్పీబీ మృతిపై యువ హీరోలు ఎమోషనల్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఇక ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు.

పాటలు ఎప్పుడూ నిలిచే ఉంటాయి..
ఎస్పీబీ బాలు గారు లేరనే వార్త విని కలత చెందాను.. ఆయన గొంతు మూగబోయిందేమో గానీ ఆయన తీయని పాటలు ఎప్పుడూ నిలిచే ఉంటాయి.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ విశాల్ ఎమోషనల్ అయ్యాడు.

సంగీత ప్రపంచానికి తీరని లోటు
ఇదో దుర్దినం.. సంగీత ప్రపంచానికి తీరని లోటు.. నా అభిమాన సింగర్ ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తి.. మీరు దూరమైనా మీ గాత్రం, గొంతు, పాటలు మాతోనే ఉంటాయి.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. అంటూ నితిన్ ట్వీట్ చేశాడు.

ఇంట్లో కుటుంబ సభ్యుడిలా
ఎస్పీబీ సర్ ఆత్మకు శాంతి చేకూరాలి.. ప్రతీ ఇంట్లో వినబడే ఆ గాత్రం గొంతు.. ప్రతీ ఇంట్లో కుటుంబ సభ్యుడిలా మారిపోయారు. మీ పాటలు మాతో, మా భావితరాలతో పాటు ఎల్లప్పుడూ నిలిచే ఉంటాయి. మీరు చేసిన సేవలకు థ్యాంక్స్ సర్.. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం.. కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని ధనుష్ ట్వీట్ చేశాడు.
Recommended Video

ప్రతీ ఇంట్లో...
భారతీయుల ప్రతీ ఇంట్లో ఉండే గొంతు.. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవ, చేసిన కృషి, ఆయన గాత్రం ఎప్పటికి శాశ్వతమే. మనుషులకు ఉండే ప్రతీ ఎమోషన్‌కు సంబంధించిన పాటలు పాడారు..ఆత్మకు శాంతి చేకూరాలి.. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం అంటూ రవితేజ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











