జోష్‌గా నితిన్ ఎంగేజ్‌మెంట్.. కాబోయే శ్రీమతికి ఉంగరం తొడిగి...పెళ్లి వేదిక ఎక్కడంటే..
టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి కార్యక్రమాలను జోరందుకొన్నాయి. పలుమార్లు వాయిదా పడిన యువ హీరో పెళ్లిని నిరాడంబరంగా జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నితిన్ పెళ్లి పనుల్లో భాగంగా బుధవారం ఉదయం వివాహ నిశ్చితార్థ కార్యక్రమం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి అతికొద్ది మందిని అంటే పదుల సంఖ్యలోనే మాత్రమే ఆహ్వానించినట్టు సమాచారం. నితిన్ ఎంగేజ్‌మెంట్ గురించి మరిన్ని వివరాలు..

అమెరికావాసి షాలినితో ప్రేమ పెళ్లి
అమెరికాకు చెందిన షాలినితో కొద్దికాలంగా నితిన్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వారి పెళ్లికి ఏప్రిల్ 15వ తేదీన వివాహం, ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేశారు. దుబాయ్‌లో జరిగే డిస్టినేషన్ వెడ్డింగ్‌కు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో హైదరాబాద్‌లోనే నిర్వహించేందుకు కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకొన్నారు.

జూలై 26 తేదీ రాత్రి పెళ్లి ముహుర్తం
తాజా వివరాల ప్రకారం.. నితిన్ పెళ్లిని కుటుంబ కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. జూలై 26వ తేదీ రాత్రి 8.30 నిమిషాలకు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఫలక్ నుమా ప్యాలెస్‌లో ఘనంగా వివాహాన్ని జరిపించాలని నిర్ణయించారు. ఇప్పటికే శాలిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకొన్నారు.

బుధవారం నితిన్ ఎంగేజ్‌మెంట్
వివాహ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నితిన్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాలిని వేలికి నితిన్ నిశ్చితార్తం ఉంగరం తొడిగారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకకు అతి ముఖ్యలైన ఫ్యామిలీ, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
Recommended Video

సీఎం కేసీఆర్, సినీ ప్రముఖులు ఆహ్వానం
పెళ్లి పనులు జోరందుకోవడంతో సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను, ఇతర సినీ, వ్యాపార ప్రముఖులకు పెండ్లి పత్రికలను హీరో నితిన్ అందజేశారు. సీఎం కేసీఆర్‌ను, ఇతర ప్రముఖులను పెళ్లికి హాజరుకావాలని మర్యాదపూర్వకంగా స్వయంగా ఆహ్వానించారు. నితిన్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్, ఇతరులు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెళ్లికి హాజరవుతానని చెప్పినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











